సాక్షి, హైదరాబాద్: 2017 ద్వితీయార్థంలో నగరంలో కార్యాలయాల స్థలానికి ఊపొచ్చింది. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు ధర, విస్తృతమైన ఉద్యోగ, వ్యాపార అవకాశాలే కారణమని ఓ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. ఐటీ హబ్‌గా పేరొందిన దక్షిణ ప్రాంతమే కాకుండా ఓఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు, మెట్రో రైలు పరుగులతో పోచారం, ఆదిభట్ల వంటి తూర్పు ప్రాంతాలకూ గిరాకీ పెరిగింది.
♦ 2017 ద్వితీయార్థంలో 3.34 మిలియన్ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్ చరిత్రలో కేవలం 6 నెలల్లో ఇంత మొత్తంలో ఆఫీస్ డీల్స్ జరగడం ఇదే తొలిసారి. 2016 హెచ్2తో పోలిస్తే ఆఫీస్ లావాదేవీల్లో 5 శాతం వృద్ధిని నమోదైంది.
♦ ఆఫీసు స్థలాల సప్లయి, వెకన్సీ స్థాయి తక్కువ ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో వెకన్సీ స్థాయి 2–4 శాతం తక్కువగా ఉంది. అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్‌ల ఏర్పాటు హైదరాబాద్ కేంద్రంగా చేయడం ఇతర కంపెనీలకు రాకకు కారణం. వీటితో పాటు చాలా కంపెనీలు నగరంలో క్యాంపస్ ఏర్పాటుకు యోచనలో ఉన్నట్లు సమాచారం.
♦ కార్యాలయాల లావాదేవీల్లో ఐటీ, ఐటీఈఎస్ రంగాల హవా ఎక్కువ. 2016 హెచ్2తో పోలిస్తే 2017 హెచ్2లో ఈ రంగాలు 75 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగం 21 శాతం, తయారీ రంగం 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2016 హెచ్2లో ఆఫీస్ మార్కెట్లో 78 డీల్స్ జరిగాయి. సగటు డీల్ సైజ్ 40,626 చ.అ., అదే 2017 హెచ్2లో 76 డీల్స్ జరిగాయి కానీ, సగటు డీల్ సైజ్ 43,882కు పెరిగింది.
♦ ప్రాంతాల వారీగా లావాదేవీలను పరిశీలిస్తే.. మాదాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, రాయదుర్గం (ఎస్‌బీడీ) ప్రాంతాలకు డిమాండ్ ఉంది. నగరంలోని మొత్తం ఆఫీసు లావాదేవీల్లో 72 శాతం ఈ ప్రాంతాలే ఆక్రమించాయి. గచ్చిబౌలి, కోకాపేట్, మదీనాగూడ, నానక్‌రాంగూడ, Ôó రిలింగంపల్లి (పీబీడీ వెస్ట్) 24 శాతం లావాదేవీలు జరిగాయి. ఉప్పల్, పోచారం (పీబీడీ ఈస్ట్), బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, పంజగుట్ట, రాజ్‌భవన్ రోడ్ (సీబీడీ)ల్లో 2017 హెచ్2లో ఒక్కటంటే ఒక్క లావాదేవీలు జరగలేదు.
♦ 2017 ప్రథమార్థంలో నగరంలో నెలకు చ.అ. అద్దె రూ.51 ఉండగా.. ద్వితీయార్థానికిది రూ.60కి పెరిగింది. ఎస్‌బీడీ ప్రాంతాల్లో నెలకు చ.అ. అద్దె రూ.68, సీబీడీ ప్రాంతాల్లో రూ.60గా ఉంది.
కళ తప్పని.. ఆఫీస్ మార్కెట్!
Published Sat, Jan 13 2018 2:40 AM | Last Updated on Sat, Jan 13 2018 2:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment