రూపాయి మరో 20 పైసలు డౌన్
ముంబై: రూపాయి పతనం కొనసాగుతోంది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 67.94కు చేరింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థారుు. ఈ నెల 10 నుంచి చూస్తే రూపాయి 151 పైసలు(2%) నష్టపోరుుంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, దిగుమతిదారుల కొనుగోళ్ల కారణంగా వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపారుు పడిపోరుుంది. రోజంతా రూపాయి తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైంది.అమెరికా రిటైల్ గణాంకాలు జోరుగా ఉండడంతో డాలర్ జోరు కూడా పెరిగింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే రేట్లను పెంచుతుందన్న అంచనాలు అధికమయ్యాయని ఇది రూపారుుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.
లాభాల్లో ప్రారంభమైనా...
ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం నాటి ముగింపు(67.74)తో పోల్చితే బుధవారం రూపారుు లాభాల్లోనే 67.68 వద్ద ప్రారంభమైంది. డాలర్ల సరఫరా తగినంతగా ఉండడం, స్టాక్ మార్కెట్‌ప్రారంభంలో లాభాల్లో ఉండడంతో మరింత బలపడి 67.61కు చేరింది.స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారిపోవడంతో రూపారుు కూడా నష్టపోరుుంది.