exchange value
-
ఆరంభ లాభాలు ఆవిరి
ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, దేశీయ వృద్ధి సంకేతాలు బలహీనంగా ఉండటంతో సూచీల లాభాలకు గండిపడింది. ఇంట్రాడేలో 364 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 70 పాయింట్ల లాభంతో 40,357 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా ఇంట్రాడేలో 102 పాయింట్లు ఎగసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,895 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకోవడం, ముడి చమురు ధరలు 0.4 శాతం తగ్గడం... సానుకూల ప్రభావం చూపించాయి. టెలికం, బ్యాంక్, పీఎస్‌యూ షేర్లు లాభపడగా, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. మిశ్రమంగా సూచీలు.... గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగింది. ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయింది. భారత–అమెరికాల మధ్య వాణిజ్య విభేదాలు సమసిపోయి ఒప్పందం కుదరగలదన్న వార్తలు, అమెరికా–చైనాల మధ్య త్వరలోనే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న అంచనాలతో తొలుత కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరి్థక గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ పేలవంగా ముగియడం ప్రతికూలం ప్రభావం చూపాయి. దీంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ►భారతీ ఎయిర్టెల్ 8.4 శాతం లాభంతో రూ. 398 వద్ద ముగిసింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు వేల కోట్ల నష్టాలను ప్రకటించిన నేపథ్యంలో మొబైల్ సేవలకు కనీస టారిఫ్‌ను నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు దీనికి నేపథ్యం. ►మాలి్వందర్, శివిందర్ సింగ్‌లపై సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ తీర్పునివ్వడంతో బీఎస్ఈలో ఈ కేసుకు సంబంధించి ఫోరి్టస్ హెల్త్‌కేర్ షేర్ ఇంట్రాడేలో 17 శాతం పతనమై రూ.129ను తాకింది. చివరకు 8 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముంబై: ప్రపంచవ్యాప్త వాణిజ్య రక్షణాత్మక చర్యలపై నెలకొన్న భయాలు, టర్కీ ఆర్థిక సంక్షోభం, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి స్థూల అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. వాణిజ్య యుద్ధ పరంగా సానుకూల వాతావరణానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవారం / మార్కెట్‌కు పాజిటివ్‌గానే ఉండవచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. టర్కీ లీరా ఏమాత్రం బలపడినా రూపాయి విలువకు స్వల్పకాలానికి కొంత బలం చేకూరుతుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అంచనావేశారు. ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ అంశాలతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కీలకంగా మారనుందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ వెల్లడించారు. బుధవారం (ఆగస్టు 22న) బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. వడ్డీ రేట్లపై ఫెడ్ వ్యాఖ్య..! అమెరికా పాలసీ రేట్లపై ఈవారంలో ఫెడ్ చైర్మన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు ప్రకటన వెలువడితే మార్కెట్‌కు ఇది ప్రతికూల అంశంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంపు దిశగా వ్యాఖ్యలు వెలువడితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.7,577 కోట్లు ఆగస్టు 1–17 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.7,577 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు ప్రొవిజినల్ డేటా ద్వారా వెల్లడయింది. రూ.2,409 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.5,168 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. 11,495 వద్ద నిరోధం ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,,495 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,340 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. 9 కంపెనీల ట్రేడింగ్ నిలిపివేత గీతాంజలి జెమ్స్, ఆమ్టెక్ ఆటో, ఈసున్ రేరోల్ అండ్ పనోరమిక్ యూనివర్సల్ షేర్లలో ట్రేడింగ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబరు 4 నుంచి బీఎస్ఈ, 5 నుంచి ఎన్ఎస్ఈలు సస్పెండ్ చేయనున్నట్లు తెలిపాయి. తంబ్బి మోడరన్ స్పిన్నింగ్ మిల్స్, ఇండో పసిఫిక్ ప్రాజెక్ట్స్, హర్యానా ఫైనాన్షియల్, నోబుల్ పాలిమర్స్, సమృద్ధి రియల్టీ షేర్లలో ట్రేడింగ్‌ను నిలివేస్తున్నట్లు బీఎస్ఈ పేర్కొంది. డిసెంబరు 2017, మార్చి 2018 కాలానికి సంబంధించి ఈ సంస్థలు ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్స్ పాటించలేదని బీఎస్ఈ తెలిపింది. ఎల్ఓడీఆర్ నిబంధనలను ఈ సంస్థలు పాటిస్తే మళ్లీ ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉందని ఎక్సే్ఛంజీలు తెలిపాయి. -
తగిన స్థాయిలోనే మారక నిల్వలు: జైట్లీ
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ తాజాగా జీవితకాల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ.. భారత్ వద్ద ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. టర్కీ ఆర్థిక సంక్షోభం కారణంగా ఫారెక్స్ మార్కెట్లో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఇప్పుడున్నటువంటి నిల్వలతో సమర్థవంతంగా ఎదుర్కునే సత్తా భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు. కరెన్సీ మార్కెట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నట్లు తెలిపారు. 403 బిలియన్ డాలర్లకు నిల్వలు రూపాయి మారకం విలువ 71 స్థాయికి క్షీణించడంతో కొన్నాళ్ల కిందటే గరిష్టస్థాయిలను నమోదుచేసిన మారక నిల్వలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కేంద్ర బ్యాంక్ సమాచారం ప్రకారం ఆగస్టు 3 నాటికి ఫారెక్స్ నిల్వలు 403 బిలియన్ డాలర్లుగా నిలిచాయి. అంతక్రితం వారం నాటి నిల్వలతో పోల్చితే 1.49 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే డాలరుతో రూపాయి విలువ 6.7 శాతం క్షీణించింది. -
రూపాయి రయ్..!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలహీనత... దేశీయంగా ఆర్థిక అంశాల బులిష్‌గా ఉండటం వంటి అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నాయి. మంగళవారం వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలపడింది. ఐదు గంటలతో ట్రేడింగ్ ముగిసే దేశీయ ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 20 పైసలు లాభపడింది. అంటే సోమవారం 63.68 వద్ద ముగిసిన రూపాయి మంగళవారం 63.48 వద్దకు చేరింది. ఉదాహరణకు ఒక డాలర్‌కు సోమవారం రూ.63.68 ఇవ్వాల్సి ఉంటే, మంగళవారం రూ.63.48 ఇస్తే సరిపోతుందన్నమాట. రూపాయి గడచిన రెండున్నరరేళ్లలో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. 2015 జూలై 17న రూపాయి విలువ 63.47. ఎందుకిలా పెరిగిందంటే... కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం నెలకొనటంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఫలిస్తాయన్న విశ్వాసమూ ఎక్కువే ఉంది. దీంతో దేశానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇవన్నీ కలిసి రూపాయి బలోపేతానికి కారణమయ్యాయి. 52 వారాల క్రితం అంటే ఏడాది కిందట... ఏకంగా 68.80 కనిష్ట స్థాయికి చేరిన రూపాయి అందరి అంచనాలకూ భిన్నంగా ప్రస్తుతం 63.48 స్థాయికి బలోపేతం అయ్యింది. అంటే అప్పట్లో రూపాయి బలహీనంగా ఉంది కనక ఒక డాలర్‌కు రూ.68.80 ఖర్చుచేయాల్సి వచ్చేంది. ఇపుడైతే రూ.63.48 చాలు. అంతర్జాతీయ మార్కెట్లో 103.50 స్థాయికి చేరిన డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు సంవత్సన్నర కాలంలో భారీస్థాయిలో పతనం కావడం రూపాయి పటిష్ఠానికి ప్రధాన కారణాల్లో ఒకటి. గడచిన నాలుగు రోజుల్లోనే రూపాయి 67 పైసలు లాభపడింది. అంతర్జాతీయంగా రెండు నెలల క్రితం డాలర్ ఇండెక్స్ 90.99 స్థాయికి చేరినప్పుడు దాదాపు 63.60 స్థాయికి చేరిన రూపాయి, మళ్లీ డాలర్ ఇండెక్స్ 95 స్థాయికి చేరడంతో తిరిగి దాదాపు 65 స్థాయికి పడింది. ఇప్పుడు మళ్లీ డాలర్ ఇండెక్స్ బలహీనం (ఈ వార్త రసే సమయం రాత్రి 9గంటలకు 91.69 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో రూపాయి 63.46 వద్ద ట్రేడవుతోంది) రూపాయి బలోపేతానికి ప్రధాన కారణాల్లో ఒకటయ్యింది. -
మళ్లీ వెయ్యి డాలర్ల పైకి బిట్ కాయిన్
మూడేళ్లలో తొలిసారి న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ శుభారంభం చేసింది. కాయిన్ మారకం విలువ ఏకంగా 1,000 డాలర్ల పైకి ఎగిసింది. మూడేళ్ల తర్వాత బిట్ కాయిన్ మారకం విలువ వెయ్యి డాలర్ల పైకి ఎగియడం ఇదే తొలిసారి. యూరప్‌కి చెందిన బిట్‌స్టాంప్ ఎక్సే్చంజీలో బిట్ కాయిన్ ఒక దశలో 1,022 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. 2013 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మొత్తం మీద 2016లో మిగతా కరెన్సీలన్నింటినీ తోసిరాజని బిట్ కాయిన్ విలువ 125 శాతం ఎగిసింది. చైనా కరెన్సీ యువాన్ బలహీనంగా ఉండటం సైతం దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనా. గణాంకాల ప్రకారం ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అత్యధికంగా చైనాలోనే జరుగుతోంది. 2013లో బిట్ కాయిన్ విలువ ఆల్ టైం రికార్డు 1,163 డాలర్ల స్థాయిని తాకింది. అయితే, ఆ తర్వాత జపాన్‌కి చెందిన మౌంట్ గోక్స్ ఎక్సే్చంజీలో హ్యాకింగ్ దెబ్బతో 400 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఈ రెండేళ్లుగా బిట్ కాయిన్ విలువ కొంత మేర స్థిరంగా కొనసాగుతోంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాలు.. ఇతరత్రా మిగతా దేశాల్లోనూ నగదు చెలామణీపైనా, పెట్టుబడులపైనా నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక రిస్కు ఉన్నప్పటికీ.. మెరుగైన ప్రత్యామ్నాయ కరెన్సీగా బిట్ కాయిన్ ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
9 నెలల కనిష్టానికి రూపాయి పతనం
• 68.56 వద్ద ముగింపు • వరుసగా నాలుగో రోజూ నష్టాలపాలు • డాలర్‌కు పెరిగిన డిమాండ్ ముంబై: తరలిపోతున్న విదేశీ నిధుల ఫలితంగా డాలర్‌తో రూపారుు మారకం విలువ వరుసగా నాలుగో రోజు నష్టాలపాలైంది. బుధవారం ఒక్క రోజే 31 పైసలు కోల్పోరుు తొమ్మిది నెలల కనిష్ట స్థారుు అరుున 68.56కు దిగజారింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో 68.25 వద్ద ముగిసిన రూపారుు బుధవారం 68.36 వద్ద ప్రారంభమైంది. రోజంతా బలహీనంగానే ట్రేడ్ అరుుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత రూపారుు ఇంత కనిష్ఠ స్థారుుకి చేరడం ఇదే మొదటి సారి. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలపడడంతో విదేశీ నిధులు తరలి పోతుండడం రూపారుు విలువపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందున్న భయాల నడుమ విదేశీ ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటుండడం వల్ల ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడినట్టు చెబుతున్నారు. నెల చివర్లో ఆరుుల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ అధికం కావడం, కరెన్సీ మారకంలో హెచ్చు, తగ్గుల నేపథ్యంలో దిగుమతి దారులు హెడ్జింగ్ విధానాన్ని ఆనుసరిస్తుండడం రూపా రుు మారకంపై ప్రభావం చూపుతున్నట్టు ఓ ఫారెక్స్ డీలర్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత డాలర్‌తో రూపారుు విలువ 2.91% క్షీణించింది. -
రూపాయి మరో 20 పైసలు డౌన్
ముంబై: రూపాయి పతనం కొనసాగుతోంది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 67.94కు చేరింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థారుు. ఈ నెల 10 నుంచి చూస్తే రూపాయి 151 పైసలు(2%) నష్టపోరుుంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, దిగుమతిదారుల కొనుగోళ్ల కారణంగా వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ రూపారుు పడిపోరుుంది. రోజంతా రూపాయి తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైంది.అమెరికా రిటైల్ గణాంకాలు జోరుగా ఉండడంతో డాలర్ జోరు కూడా పెరిగింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే రేట్లను పెంచుతుందన్న అంచనాలు అధికమయ్యాయని ఇది రూపారుుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. లాభాల్లో ప్రారంభమైనా... ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం నాటి ముగింపు(67.74)తో పోల్చితే బుధవారం రూపారుు లాభాల్లోనే 67.68 వద్ద ప్రారంభమైంది. డాలర్ల సరఫరా తగినంతగా ఉండడం, స్టాక్ మార్కెట్ప్రారంభంలో లాభాల్లో ఉండడంతో మరింత బలపడి 67.61కు చేరింది.స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారిపోవడంతో రూపారుు కూడా నష్టపోరుుంది. -
రెండు నెలల గరిష్టానికి రూపాయి
47 పైసల లాభంతో 66.75 వద్ద ముగింపు ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. రూపాయి 47 పైసలు బలపడి 66.75 వద్ద ముగిసింది. రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ యధాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయం కారణంగా బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో రూపాయి బలపడింది. తాజాగా విదేశీ నిధులు భారత్‌లోకి తరలిరావడం వల్ల కూడా రూపాయి పుంజుకుంటోందని ఫారెక్స్ డీలర్ ఒకరు వ్యాఖ్యానించారు. అందరూ అంచనా వేసినట్లుగా నాలుగు సార్లు కాకుండా ఈ ఏడాది రెండు సార్లు మాత్రమే రేట్ల పెంపు ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సూచించడం ప్రభావం చూపించింది. -
కోలుకున్న రూపాయి
► 39 పైసలు అప్ ముంబై: దేశీయంగా స్టాక్‌మార్కెట్ పుంజుకోవడంతో రూపాయి మారకం విలువ కూడా కోలుకుంది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో శుక్రవారం నాడు 29 నెలల కనిష్ట స్థాయి నుంచి రికవర్ అయ్యి 39 పైసల లాభంతో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూ. 67.63 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 67.61-67.84 శ్రేణిలో రూపాయి తిరుగాడింది. విదేశీ మార్కెట్లలో డాలరు పటిష్టంగా ఉన్నప్పటికీ రూపాయి బలపడటం గమనార్హం. స్పాట్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 67.4-68 స్థాయిల మధ్య తిరుగాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.