9 నెలల కనిష్టానికి రూపాయి పతనం
• 68.56 వద్ద ముగింపు
• వరుసగా నాలుగో రోజూ నష్టాలపాలు
• డాలర్‌కు పెరిగిన డిమాండ్
ముంబై: తరలిపోతున్న విదేశీ నిధుల ఫలితంగా డాలర్‌తో రూపారుు మారకం విలువ వరుసగా నాలుగో రోజు నష్టాలపాలైంది. బుధవారం ఒక్క రోజే 31 పైసలు కోల్పోరుు తొమ్మిది నెలల కనిష్ట స్థారుు అరుున 68.56కు దిగజారింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో 68.25 వద్ద ముగిసిన రూపారుు బుధవారం 68.36 వద్ద ప్రారంభమైంది. రోజంతా బలహీనంగానే ట్రేడ్ అరుుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత రూపారుు ఇంత కనిష్ఠ స్థారుుకి చేరడం ఇదే మొదటి సారి. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలపడడంతో విదేశీ నిధులు తరలి పోతుండడం రూపారుు విలువపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు.
పెద్ద నోట్ల రద్దు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందున్న భయాల నడుమ విదేశీ ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటుండడం వల్ల ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడినట్టు చెబుతున్నారు. నెల చివర్లో ఆరుుల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ అధికం కావడం, కరెన్సీ మారకంలో హెచ్చు, తగ్గుల నేపథ్యంలో దిగుమతి దారులు హెడ్జింగ్ విధానాన్ని ఆనుసరిస్తుండడం రూపా రుు మారకంపై ప్రభావం చూపుతున్నట్టు ఓ ఫారెక్స్ డీలర్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత డాలర్‌తో రూపారుు విలువ 2.91% క్షీణించింది.