రెండు నెలల గరిష్టానికి రూపాయి
47 పైసల లాభంతో 66.75 వద్ద ముగింపు
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. రూపాయి 47 పైసలు బలపడి 66.75 వద్ద ముగిసింది. రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ యధాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయం కారణంగా బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో రూపాయి బలపడింది. తాజాగా విదేశీ నిధులు భారత్‌లోకి తరలిరావడం వల్ల కూడా రూపాయి పుంజుకుంటోందని ఫారెక్స్ డీలర్ ఒకరు వ్యాఖ్యానించారు. అందరూ అంచనా వేసినట్లుగా నాలుగు సార్లు కాకుండా ఈ ఏడాది రెండు సార్లు మాత్రమే రేట్ల పెంపు ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సూచించడం ప్రభావం చూపించింది.