కోలుకున్న రూపాయి | The rupee recovered | Sakshi
Sakshi News home page

కోలుకున్న రూపాయి

Published Sat, Jan 23 2016 12:51 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

కోలుకున్న రూపాయి - Sakshi

కోలుకున్న రూపాయి

39 పైసలు అప్
 ముంబై: దేశీయంగా స్టాక్‌మార్కెట్ పుంజుకోవడంతో రూపాయి మారకం విలువ కూడా కోలుకుంది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో శుక్రవారం నాడు 29 నెలల కనిష్ట స్థాయి నుంచి రికవర్ అయ్యి 39 పైసల లాభంతో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూ. 67.63 వద్ద క్లోజయ్యింది.
 
ఇంట్రాడేలో 67.61-67.84 శ్రేణిలో రూపాయి తిరుగాడింది. విదేశీ మార్కెట్లలో డాలరు పటిష్టంగా ఉన్నప్పటికీ రూపాయి బలపడటం గమనార్హం. స్పాట్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 67.4-68 స్థాయిల మధ్య తిరుగాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement