ముంబై: అటు దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఇటు దేశీయ కరెన్సీ రూపాయి కూలా బలంగా ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో బలహీనపడుతున్న డాలర్ రూపాయి విలువకు క్రమంగా బలాన్నిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఆరంభంలోనే రూపాయి 24 పైసలు ఎగిసింది. రూ.66.95 స్థాయి వద్ద మూడు నెలల గరిష్టాన్ని తాకింది. గత ఏడాది నవంబర్ 10 న రూపాయి డాలర్ తోపోలిస్తే రూ. 66.63 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకుల డాలర్ అమ్మకాలు పుంజుకోవడంతో విదేశీ కరెన్సీలతో పోలీస్తే డాలర్ బలహీనంగా ఉన్నట్టు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు.
వరుసగా రెండవ సారి రిజర్వ్ బ్యాంకు కీలక రేట్లను యధాతధంగా అమలు చేయడంతో నిన్నటి మార్కెట్ లో రూపాయి బాగా కోలుకుంది. ఆర్‌బీఐ తటస్థ వైఖరితో అటు స్టాక్ మార్కెట్లో బ్యాంకులు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
మూడునెలల గరిష్టానికి రూపాయి
Published Thu, Feb 9 2017 10:14 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement