
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి గురువారం హైజంప్ చేసింది. బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే గురువారం 22పైసలు పుంజుకుంది. డాలర్ మారకంలో రూపాయి 22 పైసలు పెరిగి 63.47వద్ద కొనసాగుతోంది. నిన్న రూపాయి 9పైసలు లాబపడి 63.69వద్ద ముగిసింది. డాలర్ వీక్‌నెస్ కారణంగా ఇన్వెస్టర్లు దేశీయ కరెన్సీ వైపు మొగ్గు చూపారు. డాలర్‌లో ఎగుమతిదారులు, బ్యాంకుల అమ్మకాలు పెరగడంతో రూపాయి బలపడింది.
ముఖ్యంగా దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అమెరికా ట్రెజరీ సెక్రెటరీ వ్యాఖ్యల నేపథ్యంలో డాలర్ మరింత బలహీనంగా ఉంది. దాదాపు మూడేళ్ల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్ టైం గరిష్టాలనుంచి వెనకంజ వేసి స్వల్పనష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అటు బంగారం ధరల్లో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment