ఎస్బీఐ ఎండీగా దినేశ్కుమార్ ఖార..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేశ్‌కుమార్ ఖార నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఎస్‌బీఐ ఎండీగా మూడేళ్ల కాలంపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ నియామకానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కమిటీ మరికొన్ని బ్యాంకుల నియామకాలను చూస్తే...
♦ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా అశోక్ జార్జ్ ఎంపికయ్యారు.
♦ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా రాజ్ కమల్ వర్మ నియమితులయ్యారు.
♦ కార్పొరేషన్ బ్యాంక్ ఈడీగా గోపాల్ మురళీ భగత్ వ్యవహరించనున్నారు.
♦ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈడీగా హిమాంశు జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
♦ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా పవన్ కుమార్ బజాజ్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు.
♦ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవోగా రవీంద్ర ప్రభాకర్ మరాఠే నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు. రవీంద్ర అక్టోబర్ 1 నుంచి కానీ తర్వాత కానీ బాధ్యతలు చేపట్టవచ్చు.