డ్యూటీ ఫ్రీ షాప్స్లో ధరలను రూపాయల్లో డిస్ప్లే చేయాలి
సీబీఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ఉండే డ్యూటీ ఫ్రీ షాప్స్(డీఎఫ్‌ఎస్) వస్తువుల ధరలను రూపాయల్లో డిస్‌ప్లే చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్‌ను కూడా డిస్‌ప్లే చేయాలని పేర్కొంది. డ్యూటీ ఫ్రీ షాప్స్ రూపాయల్లో ధరలను, భారత్‌లో తయారైన వస్తువులను డిస్‌ప్లే చేయడం లేదన్న ఫిర్యాదులు పెరగడంతో సీబీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీ షాపుల్లో రూ.25 వేల వరకూ వస్తువులను కొనుగోలు చేయొచ్చు.