గృహ రుణ భారం తగ్గించుకోవాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్
గృహ రుణాన్ని ముందే చెల్లిస్తే ఆర్థికంగా ఊరట లభిస్తుంది. అధిక మొత్తంలో డబ్బులు అందినప్పుడు ఈ బరువును క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. దీంతో వడ్డీ భారం తగ్గడంతోపాటు మొత్తంగా ప్రాపర్టీ ఖర్చు కూడా దిగివస్తుంది. హోమ్ లోన్ సహా ఎలాంటి రుణమైనా సరే ఒక వ్యక్తి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండాలి. అయితే మధ్యతరగతి ప్రజలకు ఇంటి కొనుగోలుకు కావాల్సిన అధిక మొత్తాన్ని పొదుపు చేయడం కష్టమైనపని. అందుకే వారు హోమ్ లోన్స్ వైపు వెళ్తుంటారు. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకులు ఇచ్చే గృహ రుణాలు మరొకవైపు రియల్ ఎస్టేట్ వృద్ధికి కూడా దోహదపడుతున్నాయి. తీసుకున్న రుణాన్ని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి చూద్దాం..