యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు సంబంధించిన ఒక 12–అంకెల విశిష్ట సంఖ్య. యూఏఎన్ సాయంతో సులభంగా డబ్బుల్ని విత్‌డ్రా /ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఉద్యోగులు ఒక సంస్థ నుంచి వేరొక కంపెనీలోకి మారినప్పటికీ యూఏఎన్ నంబర్ మాత్రం ఒకేలా ఉంటుంది. మారదు. సభ్యుల కేవైసీ వివరాలు కలిగి ఉండి, కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈపీఎఫ్‌వో ఈ యూఏఎన్‌ను ఆవిష్కరించింది.
ఉద్యోగులు ఆన్‌లైన్ యూఏఎన్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ సాయంతో ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవచ్చు. కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నంబర్ ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సర్వీసులు పొందటానికి అర్హత కలిగి ఉన్నట్లు. పీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment