
పదవీ విరమణ చేసినవారు ఆరోగ్య బీమా తీసుకోవచ్చా?
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఆరోగ్య బీమా ఎవరికైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో 65 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా ప్రత్యేకమైన పాలసీలను అందిస్తున్నాయి బీమా కంపెనీలు. మన పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులకు పాలసీ తీసుకోవడమంటే.. అది వారికి ఒక బహుమతిని ఇచ్చినట్లే. వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. అందుకే సీనియర్ సిటిజన్స్‌కు హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిదే.
వీరికి పాలసీ తీసుకునేటప్పుడు కో-పేమెంట్, సబ్ లిమిట్స్ వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవద్దు. అలాగే వారికి సంబంధించిన అన్ని వివరాలను పాలసీ అప్లికేషన్ ఫామ్‌లో తెలియజేయండి. పాలసీ ఎంపిక సమయంలో ప్రీమియం, కవరేజ్, పాలసీ ప్రయోజనాలు, ప్రత్యేకతలు, వర్తింపు వంటి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న హెల్త్ పాలసీని ఇతర బీమా కంపెనీల పాలసీలతో పోల్చి చూసుకోండి. అలాగే తీసుకున్న పాలసీ గురించి అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోండి. రిటైర్డ్ తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం వల్ల మీరు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.