
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఫండ్ ట్రాక్ రికార్డుపై కన్నేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫండ్ పనితీరు, ఫండ్ హౌస్, దాని సేవలు... ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వీటితోపాటు ఫండ్ కు సంబంధించిన ట్రాక్ రికార్డును కూడా తెలుసుకోవాలి. దీంతో ఆ ఫండ్ అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి రాబడిని అందించిందో తెలుసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో దాని పనితీరును అంచనా వేయొచ్చు. ఉదాహరణకు మార్కెట్ పెరుగుతున్నప్పు డు ఫండ్ మంచి పనితీరును ప్రదర్శిం చడం గొప్ప విషయం కాదు. అలాగే మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఫండ్ మంచి రాబడిని అందించకపోవడమూ వింతేమీకాదు. కానీ మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఫండ్ తన బెంచ్ మార్క్‌ను అధిగమించడం విశేషం. అలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.