కొంత వ్యాపారాన్ని వెర్టెక్స్‌కు అమ్మేస్తాం: ఫస్ట్‌సోర్స్‌ | Firstsource to sell portion of India business to Vertex | Sakshi
Sakshi News home page

కొంత వ్యాపారాన్ని వెర్టెక్స్‌కు అమ్మేస్తాం: ఫస్ట్‌సోర్స్‌

Published Sat, Jul 8 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

కొంత వ్యాపారాన్ని వెర్టెక్స్‌కు అమ్మేస్తాం: ఫస్ట్‌సోర్స్‌

కొంత వ్యాపారాన్ని వెర్టెక్స్‌కు అమ్మేస్తాం: ఫస్ట్‌సోర్స్‌

న్యూఢిల్లీ: తమకు ఇండియాలో చేసే వ్యాపారంలో కొంతభాగాన్ని విక్రయించనున్నట్లు బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ ప్రకటించింది. వెర్టెక్స్‌ కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియాకు ఈ వాటాను విక్రయిస్తామని ఫస్ట్‌సోర్స్‌ ఎక్సే్ఛంజీలకు సమాచారం ఇచ్చింది. అయితే డీల్‌ విలువ వెల్లడించలేదు.

ఆర్‌పీ సంజీవ్‌ గోయింకా గ్రూప్‌ కంపెనీ అయిన ఫస్ట్‌సోర్స్‌ 2017 మార్చి క్వార్టర్లో రూ. 892 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 3,555 కోట్ల టర్నోవర్‌ సాధించింది. క్వార్టర్లీ ఆదాయంలో ఇండియా వ్యాపారం వాటా 6.1 శాతమని, పూర్తి ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 5.8 శాతమని కంపెనీ వివరించింది. ఈ వార్త నేపథ్యంలో ఫస్ట్‌సోర్స్‌ షేరు ధర బీఎస్‌ఈలో స్వల్ప తగ్గుదలతో రూ. 34,95 వద్ద ముగిసింది.