
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే గత సంవత్సరం పోలిస్తే నష్టాలనుంచి తేరుకున్నామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మార్చి 2017తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1639.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.2305.7కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 15 శాతం పెరిగింది. ఎంప్లాయ్ బెనిఫిట్ కాస్ట్ 3 శాతం తగ్గింది. అలాగే కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా క్షీణించాయి. రెగ్యులేటరీ సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని తెలిపింది. లాజిస్టిక్స్, నిల్వ సేవ ఛార్జీలు, సేకరణ ఛార్జీలు, ఇతర ఖర్చుల తగ్గింపు కారణంగా 28.96 శాతం నష్టాలను తగ్గించుకున్నామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
కాగా గ్లోబల్ రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ -ఫ్లిప్ కార్ట్ మెగా డీల్ ఇప్పటికే ఖరారైంది. ఫ్లిప్‌కార్ట్ లో 16 బిలియన్ డాలర్ల 77 శాతం వాటా కొనుగోలు ఒప‍్పందం చేసుకుంది. దీనికితోడు భారత్‌లో తన వ్యాపార ప్రత్యర్థి అమెజాన్‌కు డీకొట్టేలా మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై కూడ వాల్‌మార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్ పై వ్యాపార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ డీల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఐటీ శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment