భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్ | Flipkart, Shopclues to start sale offers from June 10 | Sakshi
Sakshi News home page

భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్

Published Sat, Jun 10 2017 10:54 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్ - Sakshi

భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. నేటి నుంచి(జూన్ 10) డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు షాప్ క్లూస్ కూడా సేల్ ఆఫర్స్ ను ప్రారంభించింది. ఫ్యాషన్ ఉత్పత్తులపై 9-డే ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభిస్తుండగా... షాప్ క్లూస్, హోమ్ కిచెన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్, ఫ్యాషన్, సంబంధిత యాక్ససరీస్ పై వారం పాటు  సేల్ ఆఫర్లు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కొద్ది ఫ్యాషన్ లవర్స్ కోసం ఈ ఎక్స్ క్లూజివ్ సేల్ ను నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషి వాసుదేవ్ తెలిపారు. జూన్ 10 నుంచి మొదలై, తొమ్మిది రోజుల పాటు అంటే జూన్ 18 వరకు ఈ సేల్ నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో 50 బ్రాండ్స్ పై 50-80 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.
 
హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. ఈ తొమ్మిది రోజుల విక్రయంలో భాగంగా ''ఏ 'బిడ్ అండ్ విన్' కంటెక్ట్స్ ను కూడా కస్టమర్లకు  ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.  ఈ కంటెక్ట్స్ లో 13,995 రూపాయల విలువైన ఎంపోరియో అర్మానీ వాచ్ ను, 15,960 రూపాయల విలువైన విక్టోరినాక్స్ బ్యాగ్ ను అందించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అదేవిధంగా షాప్ క్లూస్ నిర్వహిస్తున్న సేల్ పై కూడా  ఆ కంపెనీ భారీ ఆశలే పెట్టుకుంది. గత నెలలో నిర్వహించిన సేల్ కంటే రెండింతలు లావాదేవీలను పెంచుకోవాలని షాప్ క్లూస్ చూస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement