ల్యాప్‌టాప్‌ నెలకు రూ.999కే | Flipkart Unveils Rs. 999 per Month Laptop Offer Partnering With HP, Intel, Microsoft | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌ నెలకు రూ.999కే

Published Tue, Jun 27 2017 1:36 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ల్యాప్‌టాప్‌ నెలకు రూ.999కే - Sakshi

ల్యాప్‌టాప్‌ నెలకు రూ.999కే

హెచ్‌పీ ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌
న్యూఢిల్లీ: విద్యార్థులు, తొలిసారి పర్సనల్‌ కంప్యూటర్స్‌ కొనుగోలు చేసేవారికి నెలవారీ రూ. 999 ఈఎంఐకే ల్యాప్‌టాప్‌ అందించేలా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం హెచ్‌పీ, ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజాలతో చేతులు కలిపింది. ఈ ఆఫర్‌ కింద రూ. 36,000 ఖరీదు చేసే హెచ్‌పీ ఇంటెల్‌ కోర్‌ ఐ3 విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను 36 నెలల సులభ వాయిదా పద్ధతిలో అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఫైనా న్సింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, సిటీబ్యాంక్‌లతో టైఅప్‌ పెట్టుకున్నట్లు వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ల్యాప్‌టాప్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ విభాగం వార్షికంగా 30 శాతం మేర వృద్ధి నమోదు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement