HP laptop
-
కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం లేదా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి వారి అవసరాలకు, ప్రత్యేకించి 'కంటెంట్ క్రియేటర్ల'కు ఉపయోగపడే HP ల్యాప్‌టాప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 15 హెచ్‌పీ కంపెనీ కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించిన ల్యాప్‌టాప్‌లలో ఒకటి 'ఎన్వీ ఎక్స్360 15'. ఇది 15.6 ఇంచెస్ ఓఎల్ఈడీ టచ్ డిస్ప్లే కలిగి వారి వినియోగానికి తగిన విధంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే స్క్రీన్‌ను 360 డిగ్రీలు తిప్పవచ్చు. ఇది NVIDIA GeForce RTX 3050 లేదా AMD Radeon గ్రాఫిక్స్‌తో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్లు లేదా AMD రైజెన్ 5 పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 78999. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 14 కూడా అద్భుతమైన పనితీరుని అందించే ఉత్తమమైన ల్యాప్‌టాప్. ఇది కూడా OLED డిస్ప్లేను పొందుతుంది. దీని ధర రూ. 169999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈకామర్స్ సైట్లలోనూ లభిస్తుంది. పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా.. న్యూరల్ ప్రాసెసింగ్ కూడా కలిగి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ వంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 రూ. 179999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360 16 ల్యాప్‌టాప్ HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ 16 ఇంచెస్ డిస్ప్లే కలిగి హై-రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 మంది డిజైన్, కంటెంట్ క్రియేటర్లకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్‌టాప్ 2560 x 1600 రిజల్యూషన్, 400 నిట్ల బ్రైట్‌నెస్‌ని అందించే 16 ఇంచెస్ డిస్ప్లే ప్యానెల్ పొందుతుంది. ఇది ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16.0 GB ర్యామ్ వంటి వాటిని పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 124999. ఇది కూడా HP ఆన్లైన్ స్టోర్లలో, ఈకామర్స్ సైట్లలో లభిస్తుంది. -
ల్యాప్‌టాప్‌లు కూడా పేలతాయా? సంచలన హెచ్చరిక
హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల వినియోగదారులకు వారికి షాకింగ్ న్యూస్. ఇప్పటివరకూ స్మార్ట్ఫోన్లు పేలిన సంఘటనలు చూశాం..ఇకపై ల్యాప్‌టాప్‌లు కూడా పేలనున్నాయా? గ్లోబల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ ప్రకటనను గమనిస్తే ఈ భయాలే కలుగుతున్నాయి. ఈ కంపెనీ తయారు చేసిన బ్యాటరీలపై అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్ తప్పిదం కారణంగా 78,500 లిథియం బ్యాటరీలను వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ చేసిన తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో 50 వేల బ్యాటరీలను రీకాల్ చేసిన సంస్థ తాజాగా మరో ప్రకటన చేసిందని యూఎస్ కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంలో 101,000 బ్యాటరీలను రీకాల్ చేసింది. తమ లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన ల్యాప్టాప్స్ నుంచి మంటలొచ్చే అవకాశం ఉందని స్వయంగా హెచ్‌పీ కంపెనీ ఒప్పుకుంది. ఇవి ప్యాకేజింగ్ సమయంలోనే బాగా వేడెక్కినట్టు ఫిర్యాదులందినట్టు తెలుస్తోంది. అయితే అప్డేట్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బ్యాటరీల సేఫ్టీ మోడ్‌ను పొందొచ్చంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. డిసెంబర్ 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు విక్రయించిన నోట్‌బుక్ కంప్యూటర్స్, మొబైల్ వర్క్ స్టేషన్స్ హెచ్‌పీ లిథియం అయాన్ బ్యాటరీలు ప్రభావితమైనట్టు పేర్కొంది. అంతేకాదు వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్‌ను హెచ్‌పీ సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రీకాల్ చేసిన బ్యాటరీ మీ ల్యాప్‌టాప్‌లో ఉందేమో సరిచూసుకోమని కోరుతోంది. -
ల్యాప్‌టాప్ నెలకు రూ.999కే
హెచ్‌పీ ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ న్యూఢిల్లీ: విద్యార్థులు, తొలిసారి పర్సనల్ కంప్యూటర్స్ కొనుగోలు చేసేవారికి నెలవారీ రూ. 999 ఈఎంఐకే ల్యాప్‌టాప్ అందించేలా ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం హెచ్‌పీ, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో చేతులు కలిపింది. ఈ ఆఫర్ కింద రూ. 36,000 ఖరీదు చేసే హెచ్‌పీ ఇంటెల్ కోర్ ఐ3 విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను 36 నెలల సులభ వాయిదా పద్ధతిలో అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫైనా న్సింగ్ సదుపాయం కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, సిటీబ్యాంక్లతో టైఅప్ పెట్టుకున్నట్లు వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ల్యాప్‌టాప్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ విభాగం వార్షికంగా 30 శాతం మేర వృద్ధి నమోదు చేస్తోంది.