
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోలి్చతే 4% వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్ స్కీమ్‌లలో పెట్టుబడుల జోరుతో ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. దీనిలో లిక్విడ్ ఫండ్స్ వాటా రూ.79,000 కోట్లు. ఓపెన్–ఎండ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.9,152 కోట్లు చేరినట్లు తెలిపింది. అయితే, క్లోజ్–ఎండ్ ఈక్విటీ పథకాల నుంచి రూ.62 కోట్ల ఉపసంహరణ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment