
14 నెలల కనిష్టానికి పసిడి
ముంబై: బంగారం ధర ముంబై స్పాట్ మార్కెట్‌లో శనివారం దాదాపు 14 నెలల కనిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. వెండి ధర 18 నెలల కనిష్టానికి పడి, కీలకమైన రూ.41,000 స్థాయికన్నా కిందకు జారింది. అంతర్జాతీ యంగా బలహీన ధోరణి ఇందుకు ప్రధాన కార ణం.
వడ్డీరేట్లను యథాతథంగా నామమాత్రపు స్థాయిలో కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం డాలర్ పటిష్టతకు, యల్లో మెటల్ బలహీనతకు దారితీసిందని ఈ రంగం లో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలను చూస్తే- 10 గ్రాములకు 24 క్యారెట్ల ధర రూ.26,650 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల ధర రూ.26,500 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర ఒకేరోజు రూ.810 పడి రూ.40,510 వద్ద ముగిసింది.