Mumbai spot market
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ముంబై: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి ధర రూ. 730 తగ్గింది. దేశీయ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 30,520కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.1,750 పడిపోయి రూ.43,250కు దిగజారింది. అమెరికాలో వడ్డీరేట్లు పెరగడానికి తగిన బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా పసిడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ (నెమైక్స్)లోనూ పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. అమెరికా సెప్టెంబర్ తయారీ రంగం పటిష్ట పడిందన్న వార్తలు ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 0.25 శాతం 0.50 శాతం) ఈ ఏడాది పెరగవచ్చన్న అంచనాలు పసిడిపై ప్రభావం చూపాయి. ఈ అంచనాలతో డాలర్ బలపడి.. పుత్తడి ధర దిగజారింది. -
14 నెలల కనిష్టానికి పసిడి
ముంబై: బంగారం ధర ముంబై స్పాట్ మార్కెట్లో శనివారం దాదాపు 14 నెలల కనిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. వెండి ధర 18 నెలల కనిష్టానికి పడి, కీలకమైన రూ.41,000 స్థాయికన్నా కిందకు జారింది. అంతర్జాతీ యంగా బలహీన ధోరణి ఇందుకు ప్రధాన కార ణం. వడ్డీరేట్లను యథాతథంగా నామమాత్రపు స్థాయిలో కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం డాలర్ పటిష్టతకు, యల్లో మెటల్ బలహీనతకు దారితీసిందని ఈ రంగం లో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలను చూస్తే- 10 గ్రాములకు 24 క్యారెట్ల ధర రూ.26,650 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల ధర రూ.26,500 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర ఒకేరోజు రూ.810 పడి రూ.40,510 వద్ద ముగిసింది. -
10 నెలల కనిష్టానికి పుత్తడి
ముంబై: పసిడి ధర ముంబై స్పాట్ మార్కెట్లో శనివారం 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర క్రితం ధరతో పోల్చితే... రూ.70 తగ్గి, రూ.26,755కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.26,605కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.215 తగ్గి రూ.40,865కు దిగివచ్చింది. వరుసగా ఆరు రోజుల నుంచీ బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గడం, స్టాకిస్టుల అమ్మకాలు వంటి అంశాలు దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర బలహీనంగానే ట్రేడవుతోంది. నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,250 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. వెండి విషయంలో ఈ ధర 19 డాలర్లుగా ఉంది. అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతోందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. దీనితో పసిడిలో డబ్బు క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పసిడి, వెండి ధర మెట్టు దిగడానికి దారితీస్తోందని వారు తెలుపుతున్నారు. ఆయా అంశాలుసైతం దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని వారు భావిస్తున్నారు.