కొత్త స్టాక్ ను ఎవరు కొనడం లేదు!
కొత్త స్టాక్ ను ఎవరు కొనడం లేదు!
Published Mon, Jun 26 2017 8:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
న్యూఢిల్లీ : మరో నాలుగు రోజుల్లో జీఎస్టీ అమలు కాబోతుండగా.. పెద్ద పెద్ద కన్జ్యూమర్ కంపెనీలకు, రిటైలర్లకు అప్పుడే వివాదాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం కొత్త స్టాక్ ను కొనడానికి రిటైలర్లు ఎవరూ ముందుకు రావడం లేదని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా రిటైలర్లు సైతం కన్జ్యూమర్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడాలంటూ పట్టుబడుతున్నాయి. 4.5 మిలియన్ పైగా ఉన్న రిటైలర్లలో దీనిపై అవగాహన తీసుకురావడం కష్టతరమని, ప్రస్తుతం కొత్త స్టాక్స్ ను కొనుగోలు చేసి, ట్రేడింగ్ జరుపడంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని బిస్కెట్ తయారీదారి బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరణ్ బెర్రీ అన్నారు. కొంతమంది హోల్ సేలర్స్, రిటైలర్లు వద్ద కొన్ని రోజుల వరకు స్టాక్ ఉండదని, ఇది ఉత్పత్తి కొరతకు దారితీస్తుందని బెర్నీ చెప్పారు.
దీర్ఘకాలికంగా జీఎస్టీ సానుకూల అంశమైన్నప్పటికీ, అంతా సద్దుమణగడానికి కొన్ని క్వార్టర్ల సమయం పడుతుందని కంపెనీలు చెబుతున్నాయి. జీఎస్టీకి ముందుకు కొత్త స్టాక్స్ ను కొనడానికి, ట్రేడింగ్ జరుపడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్యారాచుట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ అంటున్నాయి. ప్రస్తుతం రిటైల్ రంగంలో అతిపెద్ద సంస్థలుగా ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్, డీమార్ట్, ఆదిత్యా బిర్లా రిటైల్ లు ఉన్నాయి. కన్జ్యూమర్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడాలంటూ ఈ రిటైల్ సంస్థలు, కన్జ్యూమర్ సంస్థలను కోరుతున్నాయి.
అమ్ముడుపోని స్టాక్స్ పై కూడా పరిహారాలపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాయి. కన్జ్యూమర్ కంపెనీలు అయితే తమ స్టాక్స్ ను కొనుగోలు చేసే విధంగా నగదు డిస్కౌంట్లను ఎరగా వేస్తున్నాయి. వివిధ ఎంఆర్పీ రేట్లపై ఒకే విధమైన ప్రొడక్ట్ అమ్మడం కూడా ఆపేశాయి. మార్జిన్లపై ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదం కన్జ్యూమర్లపై ప్రభావం చూపదని మరోవైపు నుంచి రిటైలర్లు భరోసా ఇస్తున్నాయి.
Advertisement
Advertisement