న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ కంపెనీ విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసి, వాటిని మరో దేశానికి విక్రయించిన సందర్భంలో .. భారత్‌కు రాకపోయినప్పటికీ (నేరుగా ఒక దేశం నుంచి మరో దేశానికి) ఆయా వస్తువులపై జీఎస్‌టీ చెల్లించాల్సిందేనని జీఎస్‌టీకి చెందిన ముందస్తు ఆదేశాల మండలి (ఏఏఆర్) గుజరాత్ బెంచ్ తీర్పునిచ్చింది. స్టెరిలైట్ టెక్నాల జీస్ దాఖలు చేసిన అప్లికేషన్ విషయంలో మండలి ఈ ఆదేశాలు వెలువరించింది. వర్తక వాణిజ్య లావాదేవీలపై (ఎంటీటీ/మన దేశానికి సంబంధించిన వ్యక్తి మధ్యవర్తిగా నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలు) జీఎస్‌టీ వర్తిస్తుందా అన్న విషయమై దరఖాస్తుదారు వివరణ కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment