మైక్రో ఎస్‌డీ కార్డ్ @ 512 జీబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లాష్ స్టోరేజ్ డివైస్‌ల సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కాలిఫోర్నియాకు చెందిన మైక్రోడియా ఏకంగా 512 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డును తయారు చేస్తోంది. జూలైలో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే అత్యధిక సామర్థ్యం గల ఎస్‌డీ కార్డ్‌గా ప్రపంచంలో నిలవనుంది. ఇప్ప టి వరకు మార్కెట్లో సాన్‌డిస్క్ తయారు చేసిన 200 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డ్ అధిక సామర్థ్యం గలది. మైక్రోడియా ఎస్‌డీ కార్డ్ సెక్యూర్ డిజిటల్ ఎక్స్‌టెండెడ్ కెపాసిటీ (ఎస్‌డీఎక్స్‌సీ) ఫార్మాట్‌లో రూపుదిద్దుకుంటోంది. డేటా ట్రాన్స్‌ఫర్ వేగం 300 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. ధర 1,000 డాలర్లు ఉండొచ్చని సమాచారం. ఆన్‌డ్రాయిడ్ యాప్ స్టోర్‌లో సగటు యాప్ సైజు 6 ఎంబీ ఉంటోంది. అంటే 85,333 యాప్స్‌ను ఈ కార్డులో నిక్షిప్తం చేసుకోవచ్చన్న మాట.