Micro SD card
-
మెమొరీ కార్డులపై ఆ నంబర్లెందుకు?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్డీ, మైక్రో ఎస్డీ కార్డులను వాడుతున్నారు. ఎస్డీ కార్డులను కెమెరాలు, ఇతరాలకు ఉపయోగిస్తే.. మైక్రో ఎస్డీ కార్డులను మొబైల్స్, టాబ్లెట్స్ లాంటి వాటిలో వినియోగిస్తుంటాం. అయితే ఈ ఎస్డీ కార్డులను జాగ్రత్తగా గమనిస్తే వాటిపై ‘సి’ అనే అక్షరం మధ్యలో 2, 4, 6, 10, U1, U3.. ఇలా కనిపిస్తాయి. అసలు ఇవేంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెమొరీ కార్డులపై ఉండే నంబర్లు వాటి క్లాసులను సూచిస్తాయి. అంటే అవి ఎంత స్పీడ్‌తో పనిచేస్తాయో ఈ అంకెలు తెలియజేస్తాయి. క్లాస్ 2 కార్డులు: ఈ కార్డులతో 2 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్పీడ్‌తో చాలా తక్కువ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే 2 ఎంబీ స్పీడ్ చాలా తక్కువ. క్లాస్ 4 కార్డులు: వీటిలో 4 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా 4 జీబీ, 8 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో సాధారణ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. క్లాస్ 6 కార్డులు: వీటిలో 6 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. సాధారణంగా 4, 8, 16 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 720పీ తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. క్లాస్ 10, యూ1 కార్డులు: వీటిలో 10 ఎంబీ ఫర్ సెకండ్, ఆపై స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా 60 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. 8, 16, 32, 64, 128, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 1080పీ తో హెచ్డీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. యూ3 కార్డులు: ఈ మెమొరీ కార్డ్ ద్వారా 4కె వీడియోలను ఎలాంటి అంతరాయం లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. క్లాస్ 10 కార్డుల కన్నా అత్యంత వేగవంతమైన స్పీడ్ వీటి సొంతం. -
ఫొటో తీయగానే స్టోరేజీలోకి
♦ శాన్డిస్క్ నుంచి కనెక్ట్ వైర్లెస్ స్టిక్ ♦ మూడు గ్యాడ్జెట్లకు సంధానించే వీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్లో తీసిన ఫొటోలు, వీడియోలు సాధారణంగా ఇంటర్నల్ మెమరీ లేదా మైక్రో ఎస్డీ కార్డులో నిక్షిప్తమవుతుంటాయి. ఫ్లాష్ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో ఉన్న శాన్డిస్క్ సంస్థ... కనెక్ట్ వైర్లెస్ స్టిక్ పేరిట వైఫైతో పనిచేసే చిన్న పరికరాన్ని రూపొం దించింది. ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే ఆటో బ్యాక్ అప్ ఫీచర్‌తో ఈ స్టిక్లోకి వెంటనే వచ్చి చేరిపోతాయి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఇలా ఒకేసారి మూడు గ్యాడ్జెట్లనూ శాన్డిస్క్ యాప్ డౌన్లోడ్ చేయటం ద్వారా అనుసంధానించవచ్చు. దీనివల్ల ఈ మూడు గాడ్జెట్లకూ ఈ స్టిక్ ఆటో బ్యాకప్‌గా పనిచేస్తుంది. అంతేకాక స్టిక్‌లో నిక్షిప్తమై ఉన్న ఫొటోలు, పాటలు, వీడియోలను ఈ మూడు గ్యాడ్జెట్లను వాడుతున్నవారూ ఒకేసారి ఎంజాయ్ చేయవచ్చు. హెచ్డీ వీడియోను ఎటువంటి అడ్డంకి లేకుండా మూడింటిలోనూ వీక్షించవచ్చు. బిల్ట్ ఇన్ వైఫైతో తయారైన ఈ స్టిక్ 150 అడుగుల దూరం వరకు పనిచేస్తుంది. 16జీబీ మొదలు 200 జీబీ సామర్థ్యం వరకు ఉన్న ఈ స్టిక్స్ ధర ల శ్రేణి రూ.2,390 నుంచి రూ.9,990 వరకూ ఉంది. టాప్ రిటైల్ దుకాణాలతోపాటు ఆన్లైన్లో లభిస్తాయి. అధిక సామర్థ్యమున్నవే.. దేశంలో శాన్డిస్క్ 37 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉందని కంపెనీ భారత్, సార్క్ దేశాల మార్కెటింగ్ డెరైక్టర్ జగనాథన్ చెల్లయ్య మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. భారత్‌లో 2015లో వివిధ కంపెనీలు రిటైల్ ప్యాక్‌లలో 9 కోట్ల యూనిట్ల యూఎస్బీ, మైక్రో ఎస్డీ, కెమెరా కార్డులు విక్రయించాయని చెప్పారు. తమ ఉత్పత్తుల అభివృద్ధిలో బెంగళూరు ఆర్అండ్డీ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 2 జీబీ, 4జీబీ మైక్రోఎస్డీ కార్డుల విక్రయాలను భారత్‌లో నిలిపివేశామని, 8 జీబీ ఆపైన సామర్థ్యమున్నవే అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 200 కోట్ల యూనిట్లను శాన్డిస్క్ విక్రయించిందని తెలిపారు. ఆపిల్ ఫోన్ల కోసం అన్ని ఫార్మాట్స్‌ను సపోర్ట్ చేసే ఐ-ఎక్స్పాండ్ ఫ్లాష్ డ్రైవ్‌ను 16-128 జీబీ సామర్థ్యంలో శాన్డిస్క్ రూపొందించింది. ధరల శ్రేణి రూ.4,490-10,990 మధ్య ఉంది. -
మైక్రో ఎస్డీ కార్డ్ @ 512 జీబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లాష్ స్టోరేజ్ డివైస్ల సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కాలిఫోర్నియాకు చెందిన మైక్రోడియా ఏకంగా 512 జీబీ మైక్రో ఎస్డీ కార్డును తయారు చేస్తోంది. జూలైలో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే అత్యధిక సామర్థ్యం గల ఎస్డీ కార్డ్‌గా ప్రపంచంలో నిలవనుంది. ఇప్ప టి వరకు మార్కెట్లో సాన్‌డిస్క్ తయారు చేసిన 200 జీబీ మైక్రో ఎస్డీ కార్డ్ అధిక సామర్థ్యం గలది. మైక్రోడియా ఎస్డీ కార్డ్ సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ (ఎస్డీఎక్స్సీ) ఫార్మాట్లో రూపుదిద్దుకుంటోంది. డేటా ట్రాన్స్ఫర్ వేగం 300 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. ధర 1,000 డాలర్లు ఉండొచ్చని సమాచారం. ఆన్‌డ్రాయిడ్ యాప్ స్టోర్‌లో సగటు యాప్ సైజు 6 ఎంబీ ఉంటోంది. అంటే 85,333 యాప్స్‌ను ఈ కార్డులో నిక్షిప్తం చేసుకోవచ్చన్న మాట.