మెమొరీ కార్డులపై ఆ నంబర్లెందుకు?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్‌డీ, మైక్రో ఎస్‌డీ కార్డులను వాడుతున్నారు. ఎస్‌డీ కార్డులను కెమెరాలు, ఇతరాలకు ఉపయోగిస్తే.. మైక్రో ఎస్‌డీ కార్డులను మొబైల్స్, టాబ్లెట్స్ లాంటి వాటిలో వినియోగిస్తుంటాం. అయితే ఈ ఎస్‌డీ కార్డులను జాగ్రత్తగా గమనిస్తే వాటిపై ‘సి’ అనే అక్షరం మధ్యలో 2, 4, 6, 10, U1, U3.. ఇలా కనిపిస్తాయి. అసలు ఇవేంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మెమొరీ కార్డులపై ఉండే నంబర్లు వాటి క్లాసులను సూచిస్తాయి. అంటే అవి ఎంత స్పీడ్‌తో పనిచేస్తాయో ఈ అంకెలు తెలియజేస్తాయి.
క్లాస్ 2 కార్డులు: ఈ కార్డులతో 2 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్పీడ్‌తో చాలా తక్కువ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే 2 ఎంబీ స్పీడ్ చాలా తక్కువ.
క్లాస్ 4 కార్డులు: వీటిలో 4 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా 4 జీబీ, 8 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో సాధారణ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
క్లాస్ 6 కార్డులు: వీటిలో 6 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. సాధారణంగా 4, 8, 16 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 720పీ తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
క్లాస్ 10, యూ1 కార్డులు: వీటిలో 10 ఎంబీ ఫర్ సెకండ్, ఆపై స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా 60 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. 8, 16, 32, 64, 128, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 1080పీ తో హెచ్‌డీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.
యూ3 కార్డులు: ఈ మెమొరీ కార్డ్ ద్వారా 4కె వీడియోలను ఎలాంటి అంతరాయం లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. క్లాస్ 10 కార్డుల కన్నా అత్యంత వేగవంతమైన స్పీడ్ వీటి సొంతం.