
కరోణ్యా కత్రిన్
కరోణ్యా కత్రిన్, శ్రీజిత్ లావన్ జంటగా నటించనున్న చిత్రం ‘ఎస్ డి’. ఉపశీర్షిక ‘కేరాఫ్ వెంచపల్లి’. భాను ఎంటర్‌టైన్ మెంట్స్, ప్రణవి ప్రొడక్షన్స్ బేనర్స్ పై శ్రీసాయి అమృత లక్ష్మీ క్రియేషన్స్ సమర్పణలో గోదారి పాలిక్ దర్శకత్వంలో భానుచందర్, తిరుపతి పటేల్ నిర్మించనున్నారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్న సందర్భంగా పాలిక్ మాట్లాడుతూ– ‘‘1960–1980ల మధ్యలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. శివుడు, దేవకి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారుతుంది.
ఆ క్రమంలో ఆ ఊరిలో ఉన్న ఓ దొర వీరి ప్రేమకు అడ్డుపడతాడు. ఆ దొరను ఎదిరించి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు? అనేది సినిమా. షూటింగ్ మొత్తం మంచిర్యాల తదితర ప్రాంతాలలో ఉంటుంది. కొన్నేళ్లనాటి దొరలకు సంబంధించిన ఒక పురాతనమైన కోటలో షూటింగ్ చేస్తున్నాం. ఎస్ అంటే శివుడు.. డి అంటే దేవకి వారిద్దరి పేరు వచ్చేలా సినిమా టైటిల్ ఎస్.డి అని పెట్టాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్, పాటలు: సురేష్ ఉపాధ్యాయ, సినిమాటోగ్రాఫర్: మల్లికార్జున్ .
Comments
Please login to add a commentAdd a comment