Memory card
-
మానస్ కేసు క్రైమ్ బ్రాంచ్‌కి! రాసలీలల చిప్ కోసమే..?
తమ కొడుకుది సుపారీ హత్యేనని ఆ తల్లిదండ్రులు, తన భర్త మరణం వెనుక కుట్ర దాగుందని, తనకి న్యాయం చేయకపోతే ఆత్మాహుతికి పాల్పడతానంటూ ఓ బాధితురాలు.. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందే ధర్నాకు సిద్ధపడడం సంచలనంగా మారింది. ఓ వెబ్‌పోర్టల్‌లో పని చేసే కెమెరామ్యాన్ హత్యోదాంతం.. ఇప్పుడు ఒడిశాను కుదిపేస్తోంది. ఓ వెబ్ పోర్టల్‌లో కెమెరామ్యాన్ మానస్ స్వాయిన్(28) హత్య ఉదంతం ఒడిషాను కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న సదరు వెబ్ పోర్టల్ ఓనర్ సర్మిస్తా రౌత్ ఇంకా పరారీలోనే ఉంది. దాదాపు ఇరవై రోజులు కావొస్తున్న కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులపై విమర్శలు పెరిగాయి. దీంతో ఈ కేసును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగించింది ప్రభుత్వం. మానస్ స్వాయిన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లాడు. ఆ టైంలోనే సర్మిస్తాతో పాటు మరో నలుగురు వ్యక్తులు మానస్‌ను అపహరించి.. భువనేశ్వర్ సుందర్‌పాదాలో సర్మిస్తాకు చెందిన ఓ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు మానస్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు. చిప్ కోసమేనా? ఈ కేసు ఓ మెమొరీ చిప్ చుట్టూ తిరుగుతుండడం విశేషం. అందులో సర్మిస్తా, పలువురు ప్రముఖులకు చెందిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని మానస్ స్వాయిన్ ఎక్కడో దాచి పెట్టాడని, తన రాసలీలలు బయటపడతాయనే భయంతోనే ఆమె అతన్ని దారుణంగా హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు ఉన్న పరిచయాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఒడిషా సమాచార విభాగంలో(OIS) అధికారిగా పని చేసిన నిరంజన్ సేథీని.. మూడు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన.. తన రిటైర్మెంట్కు సరిగ్గా ఒక రోజు ముందు సర్మిస్తా నడిపించే ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్‌కు యాడ్ పర్మిషన్లు ఇప్పించాడు. పైగా మానస్ హత్యకు ముందు రోజు సర్మిస్తా-నిరంజన్ మధ్య దాదాపు అరగంటకు పైగా ఫోన్ సంభాషణలు సాగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకే అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సర్మిస్తా రౌత్ సోదరుడు పరమేశ్వర్‌ను విజయవాడలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రౌత్ తప్పించుకుని పోవడానికి పరమేశ్వర్ కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో రెండు టీంలు రంగంలోకి దిగాయి. ఒకటి రౌత్ కోసం గాలిస్తుండగా.. మరొకటి ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. సర్మిస్తా రౌత్ వేరే రాష్ట్రంలో తలదాచుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే కేసును లోతుగా దర్యాప్తు చేస్తే.. రాజకీయ, హైప్రొఫైల్ సెలబ్రిటీల గుట్టు బయటపడొచ్చని భావిస్తున్నారు. -
మెమొరీ కార్డులపై ఆ నంబర్లెందుకు?
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్డీ, మైక్రో ఎస్డీ కార్డులను వాడుతున్నారు. ఎస్డీ కార్డులను కెమెరాలు, ఇతరాలకు ఉపయోగిస్తే.. మైక్రో ఎస్డీ కార్డులను మొబైల్స్, టాబ్లెట్స్ లాంటి వాటిలో వినియోగిస్తుంటాం. అయితే ఈ ఎస్డీ కార్డులను జాగ్రత్తగా గమనిస్తే వాటిపై ‘సి’ అనే అక్షరం మధ్యలో 2, 4, 6, 10, U1, U3.. ఇలా కనిపిస్తాయి. అసలు ఇవేంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెమొరీ కార్డులపై ఉండే నంబర్లు వాటి క్లాసులను సూచిస్తాయి. అంటే అవి ఎంత స్పీడ్‌తో పనిచేస్తాయో ఈ అంకెలు తెలియజేస్తాయి. క్లాస్ 2 కార్డులు: ఈ కార్డులతో 2 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్పీడ్‌తో చాలా తక్కువ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే 2 ఎంబీ స్పీడ్ చాలా తక్కువ. క్లాస్ 4 కార్డులు: వీటిలో 4 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా 4 జీబీ, 8 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో సాధారణ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. క్లాస్ 6 కార్డులు: వీటిలో 6 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. సాధారణంగా 4, 8, 16 జీబీ కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 720పీ తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. క్లాస్ 10, యూ1 కార్డులు: వీటిలో 10 ఎంబీ ఫర్ సెకండ్, ఆపై స్పీడ్‌తో డేటాను రీడ్, రైడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా 60 ఎంబీ ఫర్ సెకండ్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. 8, 16, 32, 64, 128, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. ఇందులో షూట్ సమయంలో 1080పీ తో హెచ్డీ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. యూ3 కార్డులు: ఈ మెమొరీ కార్డ్ ద్వారా 4కె వీడియోలను ఎలాంటి అంతరాయం లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. క్లాస్ 10 కార్డుల కన్నా అత్యంత వేగవంతమైన స్పీడ్ వీటి సొంతం. -
మెమోరీ కార్డ్ కోసం కిడ్నాప్
బంజారాహిల్స్: తమ్ముడు తీసుకున్న మెమోరీ కార్డ్ తిరిగి ఇవ్వలేదని అతడి అన్నను కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీ నగర్ నివాసి సీహెచ్ కృష్ణ ఆటో డ్రైవర్. ఇతని తమ్ముడు శ్రీకాంత్‌కు అదే ప్రాంతంలో నివసిస్తున్న బాబర్ స్నేహితుడు. ఇటీవల బాబర్ మెమోరీ కార్డ్‌ను శ్రీకాంత్ తీసుకుని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. అందులో తన కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఫొటోలు ఉన్నాయని బాబర్ చెప్పినా శ్రీకాంత్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటాక బాబర్ ఎన్బీ నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి వచ్చి అతని అన్న కృష్ణను బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51 వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీవ్రంగా కొట్టాడు. రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు కృష్ణ తప్పించుకొని కొద్ది దూరం పారిపోయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు బాబర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తస్మాత్...జాగ్రత్త...!
పెద్దపల్లిరూరల్ : తక్కువ ధరకు వస్తుందనో...ఒకటి కొంటే మరొక వస్తువు ఉచితంగా వస్తుందనో ఆశపడితే అసలుకే మోసపోవాల్సి వస్తుంది...కొద్ది రోజులుగా పెద్దపల్లి పట్టణంలో పేరొందిన కంపెనీల సెల్‌ఫోన్ మెమొరీ కార్డులను తక్కువ ధరకే అమ్ముతున్నట్లు నమ్మించి న ఘరానా మోసగాళ్లు పనిచేయని వాటిని అంటగట్టి అందినంత దండుకున్న విషయం వెలుగులోకి వచ్చిం ది. పెద్దపల్లి మేన్‌రోడ్డు, అమర్‌నగర్, కమాన్‌రోడ్, బ స్టాండ్ తదితర ప్రాంతాలలో ఓ ముఠా తిరుగుతూ స్మార్ట్‌ఫోన్ కలిగియున్న వినియోగదారులను గుర్తించి 32 జీబీ సామ్సంగ్ మెమొరీ కార్డు ధర దుకాణాల్లో దాదాపు రూ.వెయ్యి వరకు ఉంటుందని తాము కేవ లం రూ.450కే ఇస్తామంటు నమ్మించారు. ఇంకా కొం దరికైతే కేవలం రూ.200కే విక్రయించారు. తమకు పే రొందిన కంపెనీ 32 జీబీ మెమొరీ కార్డు తక్కువ ధర కు వచ్చింద న్న సంతోషంతో మొబైల్లో కార్డును అమ ర్చి చూస్తే అది పనిచేయనిదని తేలడంతో మోసపోయామని గ్రహించారు. పట్టణంలో ఇలా మెమొరీకార్డుల ముఠా చేతిలో చాలా మంది మోసపోయినట్లు సమాచారం. వారిలో కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గ్రామాలకు కార్లలో వచ్చి లాటరీ పేరిట అమ్మకాలు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలకు కార్లలో వచ్చి రైస్ కుక్కర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి విలువైన వస్తువులున్న బొమ్మలను కార్డుపై ముద్రించి రైస్ కుక్కరు ధరను చెల్లిస్తే కుక్కరును ఇవ్వడంతో పాటు కార్డులో సూచించిన మరో వస్తువును కచ్చితంగా ఉచితంగా పొందవచ్చని ఆశజూపుతున్నారు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు వస్తాయన్న ఆశతో లాటరీ టికెట్ తీసుకున్న వారికి నాసిరకం సీలింగ్ ఫ్యాన్లు, రైస్ కుక్కర్లను అంటగట్టారు. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి వేలాది రూపాయలను తీసుకుని నకిలీ సామగ్రిని కారులో వచ్చి అంటగడుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, రాగినేడు, మూలసాల, భోజన్నపేట తదితర గ్రామాలకు చెందిన పలువురు మోసపోయామంటున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించి తగు చర్యలు తీసుకుని వినియోగదారులు మోసాలకు గురికాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.