త్వరలో దేశీ ఈ-కామర్స్ 35 బిలియన్ డాలర్లకు | Indian e-commerce market to triple to $12 billion this year | Sakshi
Sakshi News home page

త్వరలో దేశీ ఈ-కామర్స్ 35 బిలియన్ డాలర్లకు

Published Tue, Oct 27 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

త్వరలో దేశీ ఈ-కామర్స్ 35 బిలియన్ డాలర్లకు

త్వరలో దేశీ ఈ-కామర్స్ 35 బిలియన్ డాలర్లకు

న్యూఢిల్లీ: భారత ఈ-కామర్స్ రంగ వృద్ధి పటిష్టంగా ఉందని, 2019 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని కన్సల్టెన్సీ సంస్థ నొమురా ఒక నివేదికలో పేర్కొంది. అయితే, లాభదాయకతపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఈ దిశగా ప్రస్తుతం కొంత పురోగతి కనిపిస్తోందని నొమురా తెలిపింది. కేటగిరీల్లో వైవిధ్యం, డిస్కౌం టింగ్ తగ్గించడం, రవాణా మెరుగుపర్చుకోవడం, జీఎస్‌టీ వంటి చట్టాల అమలు మొదలైన అంశాలపై మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

భారత్‌లో ఈ-కామర్స్ సంస్థలకు పండుగ సీజన్ అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ, చైనా.. అమెరికాతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉన్నాయని నొమురా వివరించింది. గతేడాది నవంబర్ 11న చైనాలో అలీబాబా సంస్థ సింగిల్స్ డే నాడు ఏకంగా 9 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపింది. అలాగే 2014లో సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే రోజుల్లో అమెరికాలో అమ్మకాలు చెరి 3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. మరోవైపు, భారత్‌లో హాలిడే అమ్మకాలు త్రైమాసికానికి 4 బిలియన్ డాలర్లుగా నొమురా అంచనా వేసింది. దేశీ ఈ-కామర్స్ కంపెనీల వార్షిక అమ్మకాల్లో సుమారు 35-40% వాటా పండుగ సీజన్‌దే (అక్టోబర్-డిసెంబర్) ఉంటోంది.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement