యూరోపియన్ల కంటే భారతీయులే సంపన్నులు!
గత పదేళ్లలో భారతీయుల సగటు సంపద 400 శాతం పెరిగిందంట. దీంతో భారతీయులు ధనికులుగా మారారని న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్టు నివేదించింది. యూరోపియన్ పౌరుల సంపద 5శాతం పడిపోయిందట. అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్, చైనా, వియత్నాంల సగటు సంపద 2005-15 మధ్య కాలంలో 400 శాతం పెరిగిందని రిపోర్టు వెల్లడించింది. యూరోపియన్ పౌరుల కనీస సంపద కేవలం 86 వేల డాలర్లేనని తెలిపింది.
ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే యూరోపియన్ల పరిస్థితి చాలా పేలవంగా ఉందని, ఆస్ట్రేలియా సగటు సంపదను 100 శాతం పెంచుకుంటే, కెనడా 50 శాతం పెంచుకుందని పేర్కొంది. 2008లో ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థికమాంద్య ప్రభావం యూరోపియన్ పౌరుల సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వెల్లడించింది. ఆదాయపు పన్ను రేట్లు పెరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తయారీ పరిశ్రమ కుంటిపడటం, కొన్ని దేశాలు పెన్షన్ బాధ్యతలను మోయలేక దివాలా తీయడం వంటివి యూరోపియన్ పౌరుల సంపదకు గండికొట్టాయని రిపోర్టు నివేదించింది.