ఐఓసీ చైర్మన్‌గా మల్హోత్రాకు బాధ్యతలు | IOC chairman Malhotra | Sakshi
Sakshi News home page

ఐఓసీ చైర్మన్‌గా మల్హోత్రాకు బాధ్యతలు

Published Tue, Jun 3 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

ఐఓసీ చైర్మన్‌గా మల్హోత్రాకు బాధ్యతలు

ఐఓసీ చైర్మన్‌గా మల్హోత్రాకు బాధ్యతలు

 న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) డెరైక్టర్ (ఆర్ అండ్ డీ) ఆర్.కె.మల్హోత్రాకు సంస్థ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో పూర్తి కాల చైర్మన్ నియామకం జాప్యమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఆర్.ఎస్.బుటోలా గత శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన వారసునిగా బి.అశోక్‌ను ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్‌బీ) గతేడాది అక్టోబర్లో ఎంపిక చేసినప్పటికీ ఆయన నిమామకాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐఓసీ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగం డెరైక్టరుగా మల్హోత్రా కొనసాగుతారని సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement