
చిత్తూరులో ఐఓసీ స్మార్ట్‌టెర్మినల్ ప్రారంభం
హైదరాబాద్ : చమురు పరిశ్రమలోనే మొట్టమొదటి స్మార్ట్‌టెర్మినల్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)చిత్తూరులో ప్రారంభించింది. రూ.127 కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరులోని యాదమరి గ్రామంలో ఈ స్మార్ట్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చామని ఐఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్‌టెర్మినల్ పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్ అని దీనిని ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ బి. అశోక్ పేర్కొన్నారు. ఉత్పత్తుల ఆర్డర్ మొదలుకొని ఉత్పత్తుల డెలివరీ వరకూ ఇక్కడ మొత్తం ఆటోమేషన్ పద్ధతిలో జరుగుతుందని వివరించారు. వంద శాతం పైప్‌లైన్ ద్వారా ఇంధన సరఫరా పొందే ఈ టెర్మినల్ చెన్నై, హైదరాబాద్ మార్కెట్లకు ఉత్పత్తులనందిస్తుందని వివరించారు.