న్యూఢిల్లీ: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో 16 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ.207 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.240 కోట్లకు పెరిగిందని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.1,656 కోట్ల నుంచి 14 శాతం పతనమై రూ.1,432 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ వీరేంద్ర డి. మహిస్కర్ పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.715 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.920 కోట్లకు పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.5,863 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యూ4లోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలో కూడా మంచి పనితీరు సాధించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment