బెంగళూరు: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఎస్‌ఎంఎల్ ఇసుజు దక్షిణ భారతదేశ మార్కెట్‌లో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లారీలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత భారత లారీ పరిశ్రమకు సరిగ్గా సరిపడే విధంగా గ్లోబల్ సిరీస్ (జీఎస్) టక్కులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన ఈ సంస్థ.. తమ నూతన టెక్నాలజీ ద్వారా రియల్–టైమ్ వాహన ట్రాకింగ్, వ్యయ నియంత్రణ, ఉత్తమ లోడింగ్ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది.
ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ‘అత్యంత అధునాతన రోబోటిక్ టెక్నాలజీతో వాహనాలు రూపుదిద్దుకున్నాయి. ఎస్‌ఎంఎల్ సారతి పేరిట అందిస్తున్న టెలిమాటిక్స్ సొల్యూషన్ ఆన్ రోడ్ సర్వీస్ వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. లారీ క్యాబిన్ సైతం డ్రైవర్‌కు మరింత సౌకర్యంగా ఉంది.’ అని వివరించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ లారీలను పూర్తిస్థాయిలో ఇక్కడే ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు.
ఎస్‌ఎంఎల్ ఇసుజు నుంచి గ్లోబల్ సిరీస్ ట్రక్కులు
Published Sat, Sep 8 2018 1:25 AM | Last Updated on Sat, Sep 8 2018 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment