ముంబై: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ ‘ఎఫ్–పేస్’ అసెంబుల్‌ను స్థానికంగానే ప్రారంభించింది. పుణే ప్లాంటులో దీన్ని తయారు చేస్తోంది. దీని ధర రూ.60.02 లక్షలు. దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న మోడల్ ధర రూ.68.4 లక్షలతో పోలిస్తే దీని ధర రూ.8.4 లక్షలు తక్కువ.
స్థానికంగా తయారుచేస్తున్న ఎఫ్–పేస్ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని నవంబర్ చివరి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని పేర్కొంది. కంపెనీ పుణే ప్లాంటులో అసెంబుల్ చేస్తోన్న ఆరో మోడల్ ఇది. జాగ్వార్ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్, ఎక్స్‌జే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్యూ వంటి మోడళ్లను ఇందులో అసెంబుల్ చేస్తోంది.
మేకిన్ ఇండియా పాలసీకి తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామో ఎఫ్–పేస్ లోకల్ అసెంబుల్‌ను చూస్తే అర్థమౌతుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. స్పోర్ట్స్ కారు డీఎన్‌ఏ, ఎస్‌యూవీ పనితీరు వంటి అంశాల మేళవింపుతో కంపెనీ ఎఫ్–పేస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment