
ఎల్‌ఐసీ నుంచి జీవన్ తరుణ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వారికోసం ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. చదువు, పెళ్ళి వంటి అవసరాలకు అనుగుణంగా ఒకేసారి లేదా ఐదేళ్ళకు కొంత మొత్తం వెనక్కి వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకంలో 90 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 12 ఏళ్ళ లోపు వారు తీసుకోవచ్చు. పాలసీదారునికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మెచ్యూర్టీ మొత్తం ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది.
ఒకేసారిగా కాకుండా 20 ఏళ్ళ వచ్చినప్పటి నుంచి ఏటా కొంత మొత్తం చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం మూడు రకాల సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్‌ను జీవన్ తరుణ్ అందిస్తోంది. ఈ సర్వైవల్ బెనిఫిట్ కింద తీసుకున్న బీమా రక్షణ మొత్తంలో ఏటా 5, 10, 15 శాతం చొప్పున ఐదేళ్ళ పాటు వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు 25వ ఏట వచ్చే మెచ్యూర్టీ మొత్తం తగ్గుతుంది. అలాగే ప్రీమియాన్ని ఒకేసారి లేదా పిల్లల వయస్సు 20 ఏళ్ళు వచ్చే వరకు చెల్లిస్తే సరిపోతుంది.