Future of children
-
కోవిడ్ ఎందరి జీవితాలనో ఛిద్రం చేసింది
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి దేశంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తును తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించింది. ఆ చిన్నారుల సంరక్షణ, చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమంపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పేర్కొంది. ‘కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఇటువంటి చిన్నారుల గుర్తించి, వారి తక్షణ అవసరాలు తీర్చేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది’అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘లక్ష మందికిపైగా చిన్నారులకు ప్రభుత్వాల రక్షణ అవసరం ఉన్నట్లు బాలల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ)లు తెలిపాయి. మైనర్లకు అవసరమైన పథకాల ప్రయోజనాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలి’అని వివరించింది. పీఎం కేర్స్ కింద రిజిస్టరైన బాలల ఫీజులు, ఇతర ఖర్చుల బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని పేర్కొంది. గత ఏడాది మార్చి తర్వాత తల్లిదండ్రులిద్దరినీ లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారి ఫీజులను మాఫీ అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా, ప్రభుత్వాల సాయం అవసరం లేని బాధిత బాలల వివరాలను కూడా సేకరించాలని సీడబ్ల్యూసీలకు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
పిల్లల భవితపై టెక్నాలజీ దెబ్బ
సాక్షి, బెంగళూరు: రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లల భవిష్యత్తును చిదిమేస్తోంది. గంటల కొద్దీ కంప్యూటర్ను వాడుతూ, వీడియో గేమ్స్ ఆడుకునే చిన్నారులు చదువులో వెనకబడి పోతున్నారు. కుటుంబ బంధాలకు దూరమవుతున్నారు. నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్(నిమ్హాన్స్) క్లినికల్ సైకాలజీ విభాగం చిన్నారుల్లో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన విషయాలు పరిశీలిస్తే సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతటి దుష్ర్పభావాలను చూపుతోందో అవగతమవుతుంది. నగరంలోని వివిధ పాఠశాలలు, పీయూసీ కళాశాలల నుంచి మొత్తం 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి నిమ్హాన్స్ సర్వే నిర్వహించింది. ఈ 200 మందిలో 73.5శాతం మంది విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి వచ్చిన వివిధ మాధ్యమాలకు బానిసలైనట్లు వెల్లడైంది. 19.5శాతం మంది వీడియోగేమ్స్, 15.5శాతం మంది మొబైల్ ఫోన్లు, 18శాతం మంది ఇంటర్నెట్ వినియోగానికి అలవాటు పడిపోయారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అలవాటు పడిన వారిలో 66శాతం మంది చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 64.5శాతం మంది క్రీడల్లో వెనకబడిపోతున్నారు. 61శాతం మంది విద్యార్థులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అలవాటు పడిన విద్యార్థుల్లో 13-15ఏళ్ల లోపు వారితో పోలిస్తే 16-17ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ 200 మంది విద్యార్థుల్లో 46.5శాతం మంది విద్యార్థులు పూర్తిగా ఫేస్‌బుక్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ అంశంపై నిమ్హాన్స్ క్లినికల్ సైకాలజీ విభాగం అడిషనల్ డెరైక్టర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ....‘ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చిన్నారుల్లో ఎక్కువవుతోంది. ఇంటర్నెట్, వీడియో గేమ్స్, మొబైల్‌ఫోన్స్ వీటి వాడకానికి అలవాటు పడిన చిన్నారులు ఆ తర్వాత వాటికి బానిసలైపోతున్నారు. తద్వారా చదువుల్లో, క్రీడల్లో ఇలా అన్ని అంశాల్లో వెనకబడిపోతున్న విషయాన్ని మేం ఈ సర్వే ద్వారా తెలుసుకున్నాం. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ ద్వారా చిన్నారులను ఈ అలవాటు నుండి తప్పించవచ్చు’ అని తెలిపారు. -
పిల్లలకు జీవిత బీమా తీసుకోవాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. పిల్లలకు జీవిత బీమా అవసరమా? ఈ ప్రశ్నకు కొందరేమో తీసుకుంటే మంచిదని, మరికొందరేమో అవసరంలేదని చెబుతుంటారు. బీమా కంపెనీలు మాత్రం ‘మీరు జీవిత బీమా పాలసీ తీసుకోండి. అది మీ పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుంది’ అని ప్రకటనలిస్తూ ఉంటాయి. దీన్ని మనం నిశితంగా గ మనిస్తే.. మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ.. బీమా పాలసీని వారి కుటుంబ భద్రతకు, పన్ను మినహాయింపుల కోసం తీసుకుంటారు. ఇక్కడ పిల్లలు ఉండేది కూడా కుటుంబంలోనే కదా! అలాంటప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు బీమా పాలసీ తీసుకునే కన్నా వారి తల్లిదండ్రులు బీమాను కలిగి ఉండటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సంబంధమైన లోపాలు, వంశానుగత సమస్యల వల్ల ఆనారోగ్యం సంక్రమిస్తుందనే ఆలోచన ఉన్న పిల్లలకు బీమా పాలసీ తీసుకోవచ్చు. పిల్లలకు ఏదైనా ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితి సంభవిస్తే, దాన్ని ఎదుర్కొనే సత్తా మీ వద్ద ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పిల్లల కోసం పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరి కుటుంబాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉండొచ్చు. అలాంటప్పుడు పాలసీ తీసుకునే ముందు నిపుణుల సలహాల మేరకు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం. -
విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు జగన్ కొండంత భరోసా
-
కొండంత భరోసా
యమపాశాలైన విద్యుత్ తీగలు అయిన వారిని పొట్టన పెట్టుకోగా.. ఆ అగ్నికీలల్లో గుండెలు మండిపోతూ శోకాగ్నితో కుమిలిపోతున్న వారికి ఓ చల్లని పలకరింపు వినిపించింది. కన్నీళ్లు పరవళ్లు తొక్కుతూ దుఃఖసాగరంలో మునిగిన అభాగ్యులను రెండు చేతులు ఆర్తిగా తాకాయి. కుటుంబ పెద్దను కోల్పోయి కుంగిపోయిన అమాయకులకు ఊరడింపు లభించింది. ఊర్మిళానగర్‌లో ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శనివారం పరామర్శించారు. నేనున్నానని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. - ఊర్మిళానగర్ విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ - అండగా ఉంటానని హామీ - విజయవాడ, నందిగామలో సాగిన పర్యటన - దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం సాక్షి, విజయవాడ : ‘దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. ఇంటిపెద్ద చనిపోయాడు. కుటుంబసభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధైర్యంతో ఉండండి. నేను అండగా ఉంటాను.’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం భవానీపురంలోని ఊర్మిళానగర్‌లో ఇటీవల కరెంట్ షాక్‌తో మృతిచెందిన కుటుంబాలను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉండి వారి పక్షాన పోరాడుతుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అండగా.. జగన్ శనివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చారు. ఎనికేపాడు వద్ద పార్టీ కార్యకర్తలు పలువురు జగన్‌ను కలిసి స్వాగతం పలికారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి నేతృత్వంలోని పార్టీశ్రేణులు జగన్‌ను కలిశారు. ఆ తర్వాత కేదారేశ్వరపేట వద్ద పార్టీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు కలిశారు. అనంతరం ఎర్రకట్ట వద్ద పలువురు మహిళలు జగన్‌ను కలిసి తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ప్రభుత్వం తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పోరాడతారని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన జగన్‌ను చిట్టినగర్‌లో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అశోక్ యాదవ్ నేతృత్వంలో పలువురు కలిశారు. అక్కడి నుంచి నేరుగా జగన్ ఊర్మిళానగర్ చేరుకున్నారు. విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఘంటా సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లారు. సుబ్బారెడ్డి భార్య చిన్నక్క, కుమారుడు తిరుపతిరెడ్డి, వారి బంధువులు జగన్‌ను చూసి తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో మృతుడు బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన భార్య రాధమ్మను, కుమారులు నారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రదీప్రెడ్డిను పరామర్శించారు. అక్కడి నుంచి నందిగామకు వెళ్లిన జగన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. నందిగామలో పరామర్శలు నందిగామ మండలం చందాపురంకు చెందిన జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా సంఘ సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు కొద్ది నెలల కిందట హత్యకు గురయ్యారు. ఆయన భార్య శ్రీలక్ష్మీ సుజాత, పిల్లలు రామకృష్ణ, విష్ణుప్రియ, బంధువులను జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి అనసాగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ నాయకుడు పాములపాటి రామకృష్ణ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. రామకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావును ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సమన్వయకర్తలు గౌతంరెడ్డి, జోగి రమేష్, సింహాద్రి రమేష్ బాబు, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, పార్టీ జెడ్పీ ఫోర్ల్‌లీడర్ తాతినేని పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు బట్టిపాటి సంధ్యారాణి, దాసరి మల్లేశ్వరి, బీబీ జాన్, ఝూన్సీ, వీరమాచినేని లలిత, ఆవుతు శ్రీశైలజ, ఆసిఫ్, బుల్లా విజయ్‌కుమార్, జమలపూర్ణమ్మ, పార్టీ నాయకులు అశోక్‌యాదవ్, డీహెచ్ఎస్వీ జానారెడ్డి పాల్గొన్నారు. జగనన్న ఉన్నారన్న ధైర్యం వచ్చింది మృతుల కుటుంబసభ్యులు మాలాంటి పేదవారి తరఫున జగన్మోహన్రెడ్డి ఉన్నారన్న ధైర్యం వచ్చిందని ఊర్మిళానగర్‌లో విద్యుదాఘాతానికి బలైన మృతుల కుటుంబసభ్యులు తెలిపారు. జగన్ వచ్చి తమను పరామర్శించటంపై మృతుల కుటుంబసభ్యులు తమ మనోగతాన్ని ‘సాక్షి’కి వెల్లడించారు. మృతుడు ఘంటా సుబ్బారెడ్డి భార్య చిన్నక్క మాట్లాడుతూ జగన్ తమ ఇంటికి రావడం ఎంతో మనోధైర్యాన్నిచ్చిందన్నారు. కుమారుడు తిరుపతిరెడ్డిని జగన్ సార్ చదివిస్తానని చెప్పటం ఊరట కలిగించిందని చెప్పారు. మరో మృతుడు బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి కుమారులు నారాయణరెడ్డి, ప్రశాంత్, ప్రదీప్ మాట్లాడుతూ జగన్ సార్ లాంటి వ్యక్తులు సమాజానికి అవసరమన్నారు. జగన్‌ను కలిసిన స్థానిక నాయకులు బాధితుల పరామర్శకు వచ్చిన జగన్‌ను పలువురు స్థానిక నాయకులు కలిశారు. వారిలో 29వ డివిజన్ కన్వీనర్ ఎస్.రామిరెడ్డి, బట్టిపాటి శివ, ఎం పోలిరెడ్డి, అబ్దుల్ ఖాదర్, వెంగళరెడ్డి, పప్పుల రమణారెడ్డి, తలారి హరీష్‌మిత్ర, మనోజ్ కొఠారి, కర్నాటి రాంబాబు, డీహెచ్వీఎస్ జానారెడ్డి, కామా దేవరాజు, బండారి వెంకట్, ఏపీ భాస్కరరావు, ఎస్కె సలాం, తుమ్మా ఆదిరెడ్డి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, లేళ్ల లాజర్, ఎస్ రమాకాంత్, వీరారెడ్డి ఉన్నారు. -
ఎల్ఐసీ నుంచి జీవన్ తరుణ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వారికోసం ఎల్ఐసీ జీవన్ తరుణ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. చదువు, పెళ్ళి వంటి అవసరాలకు అనుగుణంగా ఒకేసారి లేదా ఐదేళ్ళకు కొంత మొత్తం వెనక్కి వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకంలో 90 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 12 ఏళ్ళ లోపు వారు తీసుకోవచ్చు. పాలసీదారునికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మెచ్యూర్టీ మొత్తం ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా కాకుండా 20 ఏళ్ళ వచ్చినప్పటి నుంచి ఏటా కొంత మొత్తం చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం మూడు రకాల సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్‌ను జీవన్ తరుణ్ అందిస్తోంది. ఈ సర్వైవల్ బెనిఫిట్ కింద తీసుకున్న బీమా రక్షణ మొత్తంలో ఏటా 5, 10, 15 శాతం చొప్పున ఐదేళ్ళ పాటు వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు 25వ ఏట వచ్చే మెచ్యూర్టీ మొత్తం తగ్గుతుంది. అలాగే ప్రీమియాన్ని ఒకేసారి లేదా పిల్లల వయస్సు 20 ఏళ్ళు వచ్చే వరకు చెల్లిస్తే సరిపోతుంది. -
పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి
మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే... పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని ‘హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి’ అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు! ఈ పరిస్థితుల్లో పెద్దతరానికి ఊరటనిచ్చేలా యువతరాన్ని మలిచేవారెవరు? కాల యవనిక మరోసారి జారింది. మరుక్షణం లేవడానికే కదా! కాలంతో పాటు పరుగెట్టలేని ఎందరెందరో మధ్యలోనే రాలిపోతుంటారు. జీవితం ఎంతో విసుగ్గా తాపీగా సాగుతుందన్నప్పుడూ, కష్టాలు మనిషిని కుంగ తీస్తున్నప్పుడు- ‘అయ్యో ఈ రోజులు త్వరగా ఎందుకు కదలవు’ అనుకున్నప్పుడు ఇనుపగుళ్లు కాళ్లకి కట్టుకున్నట్టు అడుగేయదు కాలం. అదే హాయిగా ఉన్నప్పుడెందుకలా పరుగులు తీస్తుందో నాకర్థం కాదు. పద్నాల్గు వస్తోందనుకునేలోగా ఆశ్చర్యంగా అయిపోయింది! హైద్రాబాదే ఇంతగా మారితే దేశం సంగతి ప్రపంచం సంగతి గురించి ఏం చెప్పాలి? నాకు ప్రపంచం అంతా ముసలివాళ్లతో నిండిపోయినట్టు అనిపిస్తోంది! ముసలితనంలోని ఒంటరితనం, అక్కరలేని తనం తల్చుకుంటూనే చాలామంది కృంగిపోతూ కనిపిస్తున్నారు! నిజమే వృద్ధాశ్రమాలు చాలా సౌకర్యాలతో వస్తున్నాయి. కాని ఒంటరితనం ఎందుకు బాధించాలి పెద్దవాళ్లని. ఆశలూ, ఆశయాలూ కొడుకుల్లోనే చూసుకుని సర్వం త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. అది వారి అత్యాశకాదు... అభిమానం. ఎదురుచూపు కాదు... ఒంటరిగా ఉండం అన్న ఆశ. పిచ్చా! కాలం మారిపోయింది. పైసాలో ప్రపంచం అని ఇది వరకు అంటే నవ్వేరోజులు పోయాయి. డబ్బు, సౌకర్యాలు సుఖ జీవితాన్నిస్తాయని, పిల్లలు వాటిని గుమ్మరిస్తున్నారు. పాపం వాళ్లు మటుకు ఏం చేస్తారు? ఉద్యోగాలు, పెళ్లాల కండిషన్లు, తమ పిల్లల భవిష్యత్తు వారికీ ముఖ్యం కదా! నేను హైదరాబాదు శాశ్వతంగా వచ్చేశాక ఎందుకో ఒంటరితనం పీడించలేదు! చాలా సాహితీ సంస్థలు, సమాజాలు, సమావేశాలు చాలా బాగుండేవి... కాని...? చూస్తుండగానే సీను పూర్తిగా మారిపోయింది. కారణం- సాహిత్యం చచ్చిపోలేదు. సంస్కారమూ చచ్చిపోలేదు. పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. నాకు ఈ మార్పు చాలా వింతగా అనిపిస్తుంది. నేను కాళోజీ అభిమానిని. దాశరథి నన్ను ఒదినగారు అని పిలిచేవారు. సినారే నాకు అభిమాన కవి. నా కెరీర్ ప్రారంభం నుంచీ తెలిసిన వాళ్లు వేరెలా అవుతారు. అభిమానించకుండా ఉండడం ఎలా? పి.టి.రెడ్డి వంటి చిత్రకారులతో గంటలు గడిపిన సరదాను ఎలా మరిచిపోగలను? కాలం ఇంత దారుణంగా ఎందుకు మారిపోయింది! మనుషులు కాదు పట్నం కూడా పూర్తిగా మారిపోయింది. టాంక్బండ్ విగ్రహాల గట్టున కూర్చుని వేరుసెనగలు, మొక్కజొన్న పొత్తులూ హాయిగా తినగల్గేవాళ్లం. పక్కన గట్టు మీద కూర్చుని వేడివేడిగా వాడివాడిగా సాహిత్య చర్చలు, కొత్త కవితలు గానాలూ....ఆహా! తిరిగిరాని రోజులు! హైద్రాబాదు ఇప్పుడు ఒంటరి ద్వీపం. ఇక్కడి మేధావులు కూడా ఒంటిస్థంభాల వాసులు! ఎవరి గోల వారిదే! ఏ ఎండకాగొడుగే - ‘అదొక్కటే కొనసాగడానికి దారి’ అన్నాడో మిత్రుడు. నిజమే కాలంతో పాటు ఊళ్లు కూడా పాతబడిపోతాయి. కాని అందాన్ని చెడగొట్టి లాభం ఏమిటి? అన్ని రకాలుగానూ హైదరాబాద్ అందం భయంకరంగా తయారైందని ఒక్కసారి తిరిగి చూస్తే అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా ఉట్టినే చూడడానికి ప్రయాణం చేయండి. సీటు బెల్టే కాదు- వీపుకి సపోర్టు, మెడకి కాలరు- అబ్బో అదిరేలాగా రోబోలాగా తయారవ్వాలి. ఏ రోడ్డులోనూ మీరు హాయిగా ప్రయాణం సాగించలేరు! ‘సిటీ బాగా పెరిగిపోయింది. ఇదిప్పుడు అందరూ తిరగ్గలిగినదీ బ్రతక్కలిగినదీ కాదమ్మా. బండి ఉన్నవాళ్లు, డబ్బున్నవాళ్లు- తప్పించి. వాళ్లకే రక్షణలేదు’’. ఎందుకంటే ఏమో! ఎక్కడ ఆపుతారో- ఎందుకు ఆపుతారో కూడా తెలియదు. ఇక ఆకాశమార్గాలు వస్తే- జనం సుఖంగా-! ఆగండి ఆగండి. తప్పదు అవి వచ్చేదాకా సామాన్యుడి జీవితం- అంపశయ్య! ‘‘ఇప్పుడు మనం మాట్లాడ కల్గిందేం లేదు. మౌనం- గొప్ప భూషణం. అర్థం చేసుకుని బ్రతకండి’’ అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు- తమని తామే హెచ్చరించుకుంటున్నారు. జీవితంలోని కలలు, ఆశలు, ఆదర్శాలు అన్నీ గుప్పిట పట్టుకుని వచ్చిన ఎంతోమంది ఎందుకో సామూహికంగా నిట్టూరుస్తున్నారు. మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే- పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు. పరిస్థితులు మౌనంగా ఉండమంటున్నాయి. బ్రతికి బట్టకట్టడానికి మౌనం నేడు గొప్ప భూషణం. నా కళ్లముందు ఎన్నో దేశాల్లో ముసలితనాన్ని చూశాను. చాలా చోట్ల కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నా తృప్తిగానే బ్రతుకుతున్నారేమో అనిపించింది. మనని చూసి ‘మీరు చాలా అదృష్టవంతులు. అక్కడ పెద్దలకి గౌరవం ఉంది’ అంటే... నేను ఔనౌను అని తలూపాను గాని ఏదీ ఆ గౌరవం? ఏదీ ఆ ఆప్యాయత? కనిపించడం లేదేం? జనం, ఊళ్లు, వాతావరణం పూర్తిగా మారిపోయాయి ఎందుచేత? నాకు ఆలోచనలు సాగడం లేదు. ఇప్పుడు ఆడామగా తేడా లేదు అంటారు. కాని ఆడవాళ్లంతా శరీరాల్లాగా కనిపిస్తున్నారెందుకు? మగవాళ్లంతా వేటగాళ్లలూ కనిపిస్తున్నారెందుకు? సంస్కారం అన్నదేమయిపోయింది. పిల్లల్ని చూసి కన్నవారు భయపడడం ఏమిటి? పెద్దల్ని ఈడ్చి పారేసే ఈ తరానికి జన్మనెవరిచ్చారు. అమ్మకాదే? పుట్టుక కాదే? ఎక్కడిది? సమాజం సగం చచ్చిలేదు. పూర్తిగా చచ్చి దుర్గంధం వెదజిమ్ముతోంది. సెంటు కొట్టి లాభం లేదు. దహన సంస్కారమే కొత్త నాంది అవుతుందా? ఏమో ఎలా ఈ యువతరానికి మంచి దారి చూపెట్టడం?