‘దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. ఇంటిపెద్ద చనిపోయాడు. కుటుంబసభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధైర్యంతో ఉండండి. నేను అండగా ఉంటాను.’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం భవానీపురంలోని ఊర్మిళానగర్‌లో ఇటీవల కరెంట్ షాక్‌తో మృతిచెందిన కుటుంబాలను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉండి వారి పక్షాన పోరాడుతుందని భరోసా ఇచ్చారు.