
టెల్కోలు తీసుకొస్తున్న ప్లాన్లకు షాకిస్తూ ముఖేష్ అంబానీ కంపెనీ తీసుకొచ్చిన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ మరికొన్ని రోజుల పాటు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 25తో ముగిసిన ఈ ఆఫర్ గడువును పెంచినట్టు తెలిసింది. డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్‌ను జియో తన వినియోగదారులకు అందించనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. దీని కింద ప్రైమ్ యూజర్లు జియో ఓచర్లు, వాలెట్ క్యాష్‌బ్యాక్, ఆన్‌లైన్ ట్రావెల్, షాపింగ్ డిస్కౌంట్లను వచ్చే నెల మధ్య వరకు ఆఫర్ చేయనుంది. జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేస్తోంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు.
డిజిటల్ వాలెట్ల నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌లు అందుతున్నాయి. కొత్త యూజర్‌గా జియో నెట్‌వర్క్‌లో చేరి, అమెజాన్ పేను వాడుతూ రూ.459 రీఛార్జ్ ప్యాక్‌ను కొనుగోలు చేస్తే, రూ.400 విలువైన ఓచర్లు, పే బ్యాలెన్స్‌గా రూ.50 క్యాష్‌బ్యాక్, మొత్తంగా రూ.450 కస్టమర్లకు కంపెనీ ఆఫర్‌చేస్తుంది. వాలెట్ క్యాష్‌బ్యాక్, జియో ఓచర్లను వెంటనే రిడీమ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఆఫర్ మాదిరిగా కాకుండా.. యాక్సిస్ బ్యాంకు, ఫ్రీఛార్జ్ యూజర్లకు ఈ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్‌లైన్ ఫ్యాషన్, ట్రావెల్ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment