జియో ఆఫర్లు కొనసాగిస్తాం: రిలయన్స్
జియో ఆఫర్లు కొనసాగిస్తాం: రిలయన్స్
Published Thu, Oct 20 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థ కావాలంటే తన ఉచిత వాయిస్, డేటా సేవలను డిసెంబర్ 31 వరకు కాకుండా, మూడో తేదీ వరకు మాత్రమే ఇచ్చుకోవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే రిలయన్స్ మాత్రం ముందు చెప్పినట్లుగానే తాము వినియోగదారులకు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. రిలయన్స్ ఉచిత సేవల ఆఫర్ కేవలం 90 రోజుల వరకే అన్నారు.. అంటే, అది డిసెంబర్ 3తో ముగుస్తుంది. అందువల్ల వాటికి కట్టుబడి ఉండొచ్చని ట్రాయ్ తెలిపింది.
అయితే వినియోగదారులకు ముందు చెప్పినట్లుగానే తాము డిసెంబర్ నెలాఖరు వరకు ఉచితసేవలు అందిస్తామని రిలయన్స్ స్పష్టం చేసింది. డిసెంబర్ 3వ తేదీ లోగా జియో సేవలు పొందలేని వినియోగదారులు మాత్రం కొత్త ఆఫర్లు, టారిఫ్ ప్లాన్ల ప్రకారం సేవలు అందుకోవచ్చన్నారు. జియో డిజిటల్ లైఫ్‌ను భారతీయులందరికీ అందించాలని రిలయన్స్ సంస్థ భావిస్తోందని, వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఆఫర్లు, ప్లాన్లను అందించడం కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జియో టారిఫ్ ప్లాన్లు కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయన్నారు.
Advertisement