relliance jio
-
జియో నిధుల్లో కొంత డెట్ ఫండ్స్‌లోకి!
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రిలయన్స్ జియోలో వాటా విక్రయం, మరోపక్క రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర అతి స్వల్పకాలిక, మనీ మార్కెట్ ఫండ్స్, తదితర రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సగటున మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిగల వివిధ రుణ సెక్యూరిటీలలో నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశాయి. 20 బిలియన్ డాలర్లు ఇటీవల రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్ఐఎల్ 20 బిలియన్ డాలర్లను(రూ. 1,50,000 కోట్లకుపైగా) సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. కొద్ది వారాలుగా పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తోంది. దీంతో ఆర్ఐఎల్ స్వల్పకాలిక పెట్టుబడులపై ఇటీవల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆసక్తి పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కొంతమంది మనీ మేనేజర్ల వివరాల ప్రకారం ఇటీవల ఆర్ఐఎల్ సుమారు రూ. 35,000 కోట్లు(4.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీ కార్పొరేట్ కంపెనీ నుంచి ఇటీవల రుణ సెక్యూరిటీలలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ అడ్వయిజరీ సంస్థ వేల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రుపీకి బలం ఇటీవల కొద్ది వారాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో విదేశీ నిధులను సమీకరిస్తుండటంతో దేశీ కరెన్సీకి బలమొచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో గత నెల రోజుల్లో డాలరుతో మారకంలో రూపాయి 1 శాతానికిపైగా పుంజుకున్నట్లు తెలియజేశాయి. వెరసి ఆసియా కరెన్సీలలో రూపాయి ముందంజ వేసినట్లు తెలియజేశాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర ఆర్ఐఎల్ వడ్డీ రేట్ల ఆధారిత పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
జియో ఎంట్రీ : వేల కోట్లు ఆదా!!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లమేర ఆదా అయ్యి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటీవ్నెస్ (ఐఎఫ్‌సీ) తాజాగా తన నివేదికలో పేర్కొంది. ‘జియో చౌక ధరల్లో డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. సగటున చూస్తే జీబీ డేటా ధర రూ.152 నుంచి రూ.10లకు తగ్గింది. డేటా ధరల్లో గణనీయమైన తగ్గుదల సమాజంలో కొందరు తొలిసారి డేటాను వినియోగించడానికి దోహదపడింది. ఇంటర్నెట్ను అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మా గణాంకాల ప్రకారం.. జియో ఎంట్రీ వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లు ఆదా అయ్యి ఉంటుంది’ అని ఐఎఫ్‌సీ వివరించింది. ఇంటర్నెట్ విస్తరణ పెరుగుదల వల్ల తలసరి జీడీపీలో వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘ఇండియన్ టెలికం మార్కెట్లోకి జియో ప్రవేశించిన దగ్గరి నుంచి పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి’ అని ఐఎఫ్‌సీ తెలిపింది. -
జియో యూజర్లకు తీపికబురు
న్యూఢిల్లీ: జియో యూజర్లకు తీపికబురు. రిలయన్స్ జియో తాజాగా జియో ప్రైమ్ సభ్యత్వాన్ని పొడిగించింది. మరో ఏడాదిపాటు ప్రైమ్ సర్వీసులను ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. దీని కోసం యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్షిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. మామూలుగా అయితే జియో ప్రైమ్ సభ్యత్వం గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఇక కొత్త యూజర్లు రూ.99ల వార్షిక సభ్యత్వ ఫీజుతో ప్రైమ్ బెనిఫిట్స్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. ప్రైమ్ మెంబర్షిప్ కలిగినవారు లైవ్ టీవీ ఛానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్ సంబంధిత కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. -
దీపావళికి 99 శాతం ప్రజల్ని చేరుకుంటాం
బార్సెలోనా: రిలయన్స్ జియో వచ్చే దీపావళి నాటికి దేశంలోని 99 శాతం ప్రజలకు సేవలు అందించే స్థితికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ జ్యోతింద్ర థాకర్ తెలిపారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా శామ్సంగ్ భాగస్వామ్యంతో కలసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను అందించాలనుకుంటున్నట్టు, ఇది కస్టమర్లు, వ్యాపారులకు సాయంగా ఉంటుందన్నారు. ప్రతీ నెలా 8,000 నుంచి 10,000 వరకు టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి దేశంలో 99 శాతం ప్రాంతాలను కవర్ చేయగలమన్నారు. ప్రస్తుతం జియోకి 16 కోట్ల టెలికం చందాదారులు ఉన్నారు. -
4జీ స్పీడ్‌లో జియో టాప్..
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో జోరు కొనసాగుతూనే ఉంది. ఇది వరుసగా 11వ నెలలోనూ 4జీ స్పీడ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియో డౌన్లోడ్ స్పీడ్ 2017 నవంబర్‌లో 25.6 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఈ విషయాలను వెల్లడించింది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ 10 ఎంబీపీఎస్‌గా రికార్డయ్యింది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్టెల్ (9.8 ఎంబీపీఎస్), ఐడియా సెల్యులార్ (7 ఎంబీపీఎస్) ఉన్నాయి. జియో డౌన్లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 21.8 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్లోడ్ స్పీడ్ విషయానికి వస్తే.. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్‌తో టాప్‌లో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఐడియా సెల్యులర్ (6.6 ఎంబీపీఎస్), జియో (4.9 ఎంబీపీఎస్), ఎయిర్టెల్ (4 ఎంబీపీఎస్) ఉన్నాయి. -
జియో ఫోన్ యూజర్లకు రూ.49 ప్లాన్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో తన 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూ.49 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉచిత అపరిమిత కాల్స్, 1 జీబీ 4జీ డేటా వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. కంపెనీ అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్–ఆన్ ప్లాన్లను ప్రకటించింది. మరొకవైపు రిలయన్స్ జియో తన నాన్ జియో ఫోన్ ప్రిపెయిడ్ ప్రైమ్ యూజర్లకు 500 ఎంబీ డేటాను అధికంగా అందించనుంది. రోజుకు 1 జీబీ డేటా, 1.5 జీబీ డేటా అందించే ప్లాన్లను ఉపయోగిస్తున్న వారికి ఈ డేటా అందనుంది. అంటే రోజుకు 1 జీబీ డేటా పొందేవారికి 1.5 జీబీ, 1.5 జీబీ డేటా పొందేవారికి 2 జీబీ డేటా వస్తుంది. ఉదాహరణకు అప్‌గ్రేడ్ చేసిన రూ.399 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా వస్తుంది. ఇక అపరిమిత కాల్స్, ప్రీమియం యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. -
జియో నుంచి ధన్ ధనాధన్ ఆఫర్ ఇదే!
ట్రాయ్ ఆదేశాల మేరకు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంతో రిలయన్స్ జియో ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అదే రోజుకు 2 జీబీ డేటా కావాలనుకుంటే అదే 84 రోజులకు రూ. 509తో రీచార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే పరిమితం. నాన్ ప్రైమ్ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి. ఇంతకుముందున్న సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ స్థానంలో ఈ ధన్ ధనాధన్ ఆఫర్ వచ్చినట్లు జియో ప్రకటించింది. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ తమ రెగ్యులేటరీ పరిధిలోకి రాదని, అందువల్ల దాన్ని వెంటనే ఆపాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీలోగా రూ. 303తో రీచార్జి చేసుకుంటే మూడు నెలలకు పైగా ప్రయోజనాలు ఉండేలా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను రూపొందించారు. జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలంటే ఒక్కసారి రూ. 99 ఫీజు కట్టాల్సి ఉంటుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ ఫిబ్రవరిలో ప్రకటించారు. ఏడాది పాటు పలు రకాల డేటా ప్యాక్‌లను ఎంచుకునే అవకాశం ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న సభ్యులకు ఉంటుంది. -
గుజరాత్‌కు జియో బంపర్ ఆఫర్
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా ఆ రాష్ట్రంపై రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. తమది అచ్చమైన గుజరాతీ కంపెనీయేనని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ గుజరాత్‌లోనే వ్యాపారం మొదలుపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు అన్నింటినీ జియోతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పిల్లలే మన భవిష్యత్తు అని, వారికి సాయపడేందుకే ఇలా చేస్తున్నామని అన్నారు. దేశంలో 50 లక్షల రిలయన్స్ జియో కస్టమర్లను సాధించిన తొలి రాష్ట్రం గుజరాత్ అని చెప్పడానికి గర్వపడుతున్నట్లు అంబానీ చెప్పారు. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇంత తక్కువ కాలంలో ప్రజల ఆలోచనా ధోరణిని మార్చలేదని ప్రశంసించారు. అగ్రగామి రాష్ట్రం ఇదే కాగా, ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్నింటినీ అమ్మే టాటా కంపెనీల గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా కూడా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌ను మోదీ ఉత్పత్తుల కేంద్రంగా రూపొందించారని, నవభారతంలో గుజరాత్ అగ్రగామి రాష్ట్రం అవ్వడం ఖాయమని తెలిపారు. ఇంత మంచి నాయకత్వం అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలని అన్నారు. ఏమిటీ సదస్సు? వైబ్రెంట్ గుజరాత్.. నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రారంభించిన సదస్సు. ఇప్పుడు ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా తదితరులతో పాటు దాదాపు 20 దేశాల అధినేతలు, మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య దేశాలుగా ఉండేందుకు 12 దేశాలు అంగీకరించాయి. అవి.. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, పోలండ్, సింగపూర్, స్వీడన్, యూఏఈ. -
జియోకు జరిమానా.. ఎంతో తెలుసా?
-
జియోకు జరిమానా.. ఎంతో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు రిలయన్స్ జియో మీద జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ జరిమానా ఎంతో తెలిస్తే మాత్రం కళ్లు తిరగక మానవు.. అక్షరాలా 500 రూపాయలు మాత్రమే!! దీనికి సంబంధించి చిహ్నాలు, పేర్ల అక్రమ వినియోగ నిరోధానికి సంబంధించిన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఇంతే విధించాలని ఉంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు. ప్రధాని ఫొటోను జియో ప్రకటనలలో వాడుకునేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాథోడ్ ఈ విషయం చెప్పారు. ప్రకటనలలో ప్రధానమంత్రి ఫొటోను రిలయన్స్ జియో వాడుకుందన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలుసని ఆయన తన లిఖిత సమాధానంలో తెలిపారు. ఒక ప్రైవేటు సంస్థ తన ప్రకటనలలో ప్రధానమంత్రి ఫొటోను ఉపయోగించుకోవడంపై ప్రతిపక్షం తీవ్రంగా ప్రశ్నించింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం ప్రకటనలలో కూడా ప్రధాని ఫొటో వచ్చిందని, దీన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం ఏమైనా ఉందా అని నీరజ్ శేఖర్ ప్రశ్నించారు. 1950 నాటి చిహ్నాలు, పేర్ల (అసమాన వినియోగం నివారణ) చట్టాన్నివినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుందని, దాని ప్రకారం జాతీయ చిహ్నాలను గానీ, ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలను గానీ అనుమతి లేకుండా ఉపయోగించకూడదని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. అయితే, ఇప్పుడు మోదీ ఫొటో దుర్వినియోగంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
జియో ఆఫర్లు కొనసాగిస్తాం: రిలయన్స్
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థ కావాలంటే తన ఉచిత వాయిస్, డేటా సేవలను డిసెంబర్ 31 వరకు కాకుండా, మూడో తేదీ వరకు మాత్రమే ఇచ్చుకోవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే రిలయన్స్ మాత్రం ముందు చెప్పినట్లుగానే తాము వినియోగదారులకు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. రిలయన్స్ ఉచిత సేవల ఆఫర్ కేవలం 90 రోజుల వరకే అన్నారు.. అంటే, అది డిసెంబర్ 3తో ముగుస్తుంది. అందువల్ల వాటికి కట్టుబడి ఉండొచ్చని ట్రాయ్ తెలిపింది. అయితే వినియోగదారులకు ముందు చెప్పినట్లుగానే తాము డిసెంబర్ నెలాఖరు వరకు ఉచితసేవలు అందిస్తామని రిలయన్స్ స్పష్టం చేసింది. డిసెంబర్ 3వ తేదీ లోగా జియో సేవలు పొందలేని వినియోగదారులు మాత్రం కొత్త ఆఫర్లు, టారిఫ్ ప్లాన్ల ప్రకారం సేవలు అందుకోవచ్చన్నారు. జియో డిజిటల్ లైఫ్‌ను భారతీయులందరికీ అందించాలని రిలయన్స్ సంస్థ భావిస్తోందని, వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఆఫర్లు, ప్లాన్లను అందించడం కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జియో టారిఫ్ ప్లాన్లు కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయన్నారు.