
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో తన 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూ.49 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉచిత అపరిమిత కాల్స్, 1 జీబీ 4జీ డేటా వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. కంపెనీ అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్–ఆన్ ప్లాన్‌లను ప్రకటించింది.
మరొకవైపు రిలయన్స్ జియో తన నాన్ జియో ఫోన్ ప్రిపెయిడ్ ప్రైమ్ యూజర్లకు 500 ఎంబీ డేటాను అధికంగా అందించనుంది. రోజుకు 1 జీబీ డేటా, 1.5 జీబీ డేటా అందించే ప్లాన్‌లను ఉపయోగిస్తున్న వారికి ఈ డేటా అందనుంది. అంటే రోజుకు 1 జీబీ డేటా పొందేవారికి 1.5 జీబీ, 1.5 జీబీ డేటా పొందేవారికి 2 జీబీ డేటా వస్తుంది. ఉదాహరణకు అప్‌గ్రేడ్ చేసిన రూ.399 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా వస్తుంది. ఇక అపరిమిత కాల్స్, ప్రీమియం యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.
Comments
Please login to add a commentAdd a comment