జ్యోతిష్యుల ముందుకు టెకీలు బారులు
జ్యోతిష్యుల ముందుకు టెకీలు బారులు
Published Tue, Jul 25 2017 3:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
బెంగళూరు : షీలా బజాజ్ డైరీ బెంగళూరులో ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజిస్ట్ అంటే సంఖ్యా జ్యోతిష్యశాస్త్రమన మాట. అదృష్టం కలిసి రానప్పుడు, లేదా ఏదైనా చికాకులు ఎదుర్కొంటున్నప్పడు పేర్లలో మార్పులు వంటి వాటిని వారు సూచిస్తుంటారు. ప్రస్తుతం కొరమంగలలో ఉన్న షీలా న్యూమరాలజిస్ట్ కన్సల్టేషన్ సంస్థకు టెకీలు బారులు తీరుతున్నారంట. దీనికి గల ప్రధాన కారణం ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే. చాలామంది సాఫ్ట్‌వేర్ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
95 శాతం తమ క్లయింట్స్ ఇటీవల ఐటీ రంగం వారేనని ప్రముఖ న్యూమరాలజిస్ట్ షీలా బజాజ్ చెప్పారు. వారిలో కూడా ఎక్కువగా 35-45 మధ్య వయస్కులేనని పేర్కొన్నారు. అంతకముందు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగం కోసం తమ దగ్గరకు వచ్చేవారని, కానీ ప్రస్తుతం ఉద్యోగ భద్రత ఎక్కువ ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. షీలా బజాజ్‌కు ఎక్కువ క్లయింట్స్‌గా సిటీ నటులు, రాజకీయవేత్తలు ఉండటం విశేషం.
తమను ఆశ్రయిస్తున్న ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా అడిగే ప్రశ్నలు.. లేఆఫ్ ప్రమాదంలో ఉన్నామని, దాని నుంచి బయటపడాలంటే, ఆధ్యాత్మిక పరిష్కారమేమిటని అడుగుతున్నారని బజాబ్ చెప్పారు. లేఆఫ్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వీరు వెనుకాడటం లేదట. అత్యధిక మొత్తంలో కన్సల్టేషన్ ఫీజులను కూడా చెల్లిస్తున్నారని తెలిసింది. ఉద్యోగ కోతతో తమ కంపెనీ ఏప్రిల్-జూలై నెలలో 50 మంది తమ కొలీగ్స్‌ను తీసివేశారని, తనను ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలంటూ ఓ కంపెనీకి చెందిన ప్రొగ్రామ్ మేనేజర్ చంద్రు ఎం కోరినట్టు బజాజ్ తెలిపారు.
''నాకు నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఉంది. దీంతో నా ఉద్యోగానికి భద్రత కల్పించుకోగలుగుతా. టారోట్ రీడర్ అంచనాల ప్రకారం నేను చేస్తున్న ఉద్యోగం కోల్పోనని తెలిసింది. ఈ వార్తతో నాలో ఉన్న భయాందోళనలు తొలిగిపోయి, ఎంతో నమ్మకంతో, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా'' అని ఓ ఐటీ నిపుణుడు చెప్పాడు. ఇలా చాలామంది ఐటీ ఉద్యోగులు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారు, కుటుంబసభ్యులు, వారితో సంబంధాలు, ఆరోగ్యం కంటే కూడా ఎక్కువగా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. గత కొన్ని నెలలలుగా ఐటీ రంగం నుంచి తమకు క్లయింట్లు పెరుగుతున్నారని తెలిపారు.
Advertisement
Advertisement