IT techies
-
‘ఆహా ఓహో అంటూ ఉద్యోగం నుంచి ఊడబీకారు’!..గూగుల్ మహిళా ఉద్యోగి ఆవేదన
వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్. బిటెక్ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్ సెటిల్ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్ కమ్ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్. కానీ ఎప్పుడూ లాభాలు వస్తే అది వ్యాపారం ఎందుకవుతుంది. ప్రతీ రోజూ ఈజీగా గడిచి పోతే అది ఉద్యోగం ఎందుకవుతుంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉన్నవాళ్లను పీకేస్తున్నాయి. కొత్త వాళ్లను వద్దంటున్నాయి. దీంతో టెక్కీల ఆదాయం, ఆనందం ఆవిరవుతుంది. ఆహా ఓహో అంటూ తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా 12000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారికి పింక్ స్లిప్ జారీ చేస్తూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెయిల్స్ పంపారు. అంతే ఆ పింక్ స్లిప్‌లు చూసిన టెక్కీల ఆనందం ఆవిరై సోషల్ మీడియా వేదికగా తమ బాధల్ని వెళ్లగక్కుతున్నారు. గూగుల్ ఫైర్ చేసిన ఉద్యోగుల్లో ప్రోగ్రామ్ మేనేజర్ కేథరీన్ వాంగ్ ఒకరు. ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తిన సంస్థ.. ఆ మరోసటి రోజు లేఆఫ్స్ ప్రకటించి అగాధంలోకి నెట్టిందని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వాపోయారు. ఉద్యోగం నుంచి తొలగించడం బాధగా ఉంది సంస్థ నుంచి టెర్మినేషన్ లెటర్ రావడంతో నేనెందుకు? ఇప్పుడెందుకు అనే ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఇలాంటి సిచ్యూవేషన్స్ను జీర్ణించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా నా పనితీరు బాగుందని రివ్వ్యూ ఇచ్చిన వెంటనే ఫైర్ చేయడం బాధాకరంగా ఉంది. నేను నిర్వహించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక లేఆఫ్స్‌తో 34 వారాల గర్భిణిగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, నెలల తరబడి ప్రసూతి సెలవుపై వెళ్లడం దాదాపూ అసాధ్యం' అని కేథరిన్ వాంగ్ పేర్కొన్నారు. ఒంట్లో వణుకు పుడుతుంది నా బిడ్డ క్షేమం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించ లేకపోతున్నాను. ఎందుకంటే నా లోపల (గర్బిణి) ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉద్యోగం పోవడంతో వణుకుతున్న నా చేతుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటూ విచారం వ్యక్తం చేశారు. ఐ లవ్ గూగుల్ నేను ఇప్పటికీ గూగుల్‌ను ప్రేమిస్తున్నారు. గూగుల్‌ను మేము ఒక కుటుంబంగా భావిస్తాను. ఇప్పటికీ టీం సహచర ఉద్యోగులకు, నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో సానుకూల వ్యాపార ధోరణిని అవలంభిస్తున్న గూగుల్ కంపెనీలు పనిచేయడం గర్వంగా ఉందని వాంగ్ ముగించారు. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
జ్యోతిష్యుల ముందుకు టెకీలు బారులు
బెంగళూరు : షీలా బజాజ్ డైరీ బెంగళూరులో ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజిస్ట్ అంటే సంఖ్యా జ్యోతిష్యశాస్త్రమన మాట. అదృష్టం కలిసి రానప్పుడు, లేదా ఏదైనా చికాకులు ఎదుర్కొంటున్నప్పడు పేర్లలో మార్పులు వంటి వాటిని వారు సూచిస్తుంటారు. ప్రస్తుతం కొరమంగలలో ఉన్న షీలా న్యూమరాలజిస్ట్ కన్సల్టేషన్ సంస్థకు టెకీలు బారులు తీరుతున్నారంట. దీనికి గల ప్రధాన కారణం ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే. చాలామంది సాఫ్ట్వేర్ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. 95 శాతం తమ క్లయింట్స్ ఇటీవల ఐటీ రంగం వారేనని ప్రముఖ న్యూమరాలజిస్ట్ షీలా బజాజ్ చెప్పారు. వారిలో కూడా ఎక్కువగా 35-45 మధ్య వయస్కులేనని పేర్కొన్నారు. అంతకముందు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగం కోసం తమ దగ్గరకు వచ్చేవారని, కానీ ప్రస్తుతం ఉద్యోగ భద్రత ఎక్కువ ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. షీలా బజాజ్‌కు ఎక్కువ క్లయింట్స్‌గా సిటీ నటులు, రాజకీయవేత్తలు ఉండటం విశేషం. తమను ఆశ్రయిస్తున్న ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా అడిగే ప్రశ్నలు.. లేఆఫ్ ప్రమాదంలో ఉన్నామని, దాని నుంచి బయటపడాలంటే, ఆధ్యాత్మిక పరిష్కారమేమిటని అడుగుతున్నారని బజాబ్ చెప్పారు. లేఆఫ్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వీరు వెనుకాడటం లేదట. అత్యధిక మొత్తంలో కన్సల్టేషన్ ఫీజులను కూడా చెల్లిస్తున్నారని తెలిసింది. ఉద్యోగ కోతతో తమ కంపెనీ ఏప్రిల్-జూలై నెలలో 50 మంది తమ కొలీగ్స్‌ను తీసివేశారని, తనను ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలంటూ ఓ కంపెనీకి చెందిన ప్రొగ్రామ్ మేనేజర్ చంద్రు ఎం కోరినట్టు బజాజ్ తెలిపారు. ''నాకు నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఉంది. దీంతో నా ఉద్యోగానికి భద్రత కల్పించుకోగలుగుతా. టారోట్ రీడర్ అంచనాల ప్రకారం నేను చేస్తున్న ఉద్యోగం కోల్పోనని తెలిసింది. ఈ వార్తతో నాలో ఉన్న భయాందోళనలు తొలిగిపోయి, ఎంతో నమ్మకంతో, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా'' అని ఓ ఐటీ నిపుణుడు చెప్పాడు. ఇలా చాలామంది ఐటీ ఉద్యోగులు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారు, కుటుంబసభ్యులు, వారితో సంబంధాలు, ఆరోగ్యం కంటే కూడా ఎక్కువగా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. గత కొన్ని నెలలలుగా ఐటీ రంగం నుంచి తమకు క్లయింట్లు పెరుగుతున్నారని తెలిపారు.