
బెంగళూరు: గీతాంజలి జెమ్స్ సంస్థకు మూలధన అవసరాల కోసం నిధులు సర్దుబాటు చేయగా 86.5 కోట్ల మేర మోసానికి పాల్పడిందంటూ కర్ణాటక బ్యాంకు ఆర్‌బీఐకి రిపోర్ట్ చేసింది. మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌కు మూలధన అవసరాలను కొనసాగించగా ఆ సంస్థ మోసం చేసినట్టు ఆర్‌బీఐకి తెలియజేశామని బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు నిధులను కేటాయిస్తామని పేర్కొంది. అయితే, గీతాంజలి జెమ్స్‌కు ఎల్‌వోయూల పరంగా బ్యాంకుకు ఎటువంటి ఎక్స్‌పోజర్ లేదని స్పష్టం చేసింది. నీరవ్ మోదీ, మెహుల్‌చోక్సీలు పీఎన్‌బీ నుంచి ఎల్‌వోయూలు తీసుకుని రూ.13,540 కోట్ల మేర మోసగించగా, దానిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment