న్యూఢిల్లీ: లెమన్ మొబైల్స్ తాజాగా యాడ్సన్ ఇంపెక్స్ భాగస్వామ్యంతో రూ.100 కోట్లతో భారత్‌లో టెంపర్డ్ గ్లాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘‘గత నెలలో తయారీ యూనిట్‌ను, ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీని ఆవిష్కరించాం.
మొబైల్ పరిశ్రమలో మరింత విస్తరించేందుకు గ్లాస్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం’’ అని లెమన్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ చుగ్ తెలిపారు. నెలకు రెండు కోట్లకుపైగా మొబైల్ టెంపర్డ్ గ్లాస్‌ల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. హరియాణాలోని కుండ్లి ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, సెప్టెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. టెంపర్డ్ గ్లాస్ ప్లాంటు వల్ల 3,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment