ఏపీ మార్కెట్లో మహా సిమెంట్‌ | maha cement in ap market | Sakshi
Sakshi News home page

ఏపీ మార్కెట్లో మహా సిమెంట్‌

Published Tue, Dec 27 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

ఏపీ మార్కెట్లో మహా సిమెంట్‌

ఏపీ మార్కెట్లో మహా సిమెంట్‌

నూతన లోగో ఆవిష్కరణ
సాక్షి, విశాఖపట్నం: మహా సిమెంట్‌ కోసం మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంహెచ్‌ఐపీఎల్‌) నవీకరించిన బ్రాండ్‌ గుర్తింపు (లోగో)ను   ట్యాగ్‌ లైన్‌ ’బిల్డ్‌ ఇన్‌ స్ట్రాంగ్‌’ పేరుతో సోమవారం విశాఖలో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌ ఆవిష్కరించారు. కంపోజిట్‌ సిమెంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. 18 ఏళ్లుగా సిమెంట్‌ పరిశ్రమలో అత్యంత కీలక ప్లేయర్‌గా మహా సిమెంట్‌ కొనసాగుతోందని,  తమ ప్రస్తుత బ్రాండ్లన్నింటినీ మహా సిమెంట్‌ ఐడెంటిటీతో ఏకీకృతం చేయనున్నామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె. రంజిత్‌రావు చెప్పారు. కొత్త బ్రాండ్‌ ఐడెంటిటీని ఆవిష్కరించడం తమ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఈ లోగోను హైదరాబాద్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారని, దానిని నేను ఏపీలో ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. కంపెనీ సీఈవో ఎస్‌.సాంబశివ రావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి రూ. 200 కోట్ల వ్యాపారంతో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌  రంజిత్‌రావు, మార్కెటింగ్‌ అధ్యక్షుడు కె. విజయవర ్ధన్, సినీయర్‌ మార్కెటింగ్‌ మెంబర్‌ పి.మాథై పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement