మార్కెట్లోకి మహీంద్రా జివో ట్రాక్టర్‌ | Mahindra & Mahindra launches Jivo tractor at Rs 3.9 lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మహీంద్రా జివో ట్రాక్టర్‌

Published Thu, Apr 6 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

మార్కెట్లోకి మహీంద్రా జివో ట్రాక్టర్‌

మార్కెట్లోకి మహీంద్రా జివో ట్రాక్టర్‌

ధరలు రూ.3.90–రూ.4.05 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ  చిన్న సైజు ఫోర్‌–వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. జివో పేరుతో అందిస్తున్న  24 హార్స్‌ పవర్‌ ఉన్న ఈ ట్రాక్టర్‌ ధరలు రూ.3.90 లక్షల నుంచి రూ.4.05 లక్షల రేంజ్‌లో(ఎక్స్‌ షోరూమ్, మహారాష్ట్ర) ఉన్నాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ తెలిపింది.

ఈ ట్రాక్టర్‌తో తాము ఉద్యానవన, యంత్రీకరణ వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తున్నామని ఎం అండ్‌ ఎం ఎండీ, పవన్‌ గోయెంకా చెప్పారు. ఈ నెల 25 నుంచి ఈ ట్రాక్టర్లను మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో విక్రయించడం ప్రారంభిస్తామని, త్వరలో కర్నాటక, మధ్యప్రదేశ్‌ మార్కెట్లకు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement