న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నికర లాభం 12% పెరిగి రూ. 1,216 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 1,081 కోట్లు. ఇక కంపెనీ ఆదాయం కూడా రూ. 11,578 కోట్ల నుంచి రూ. 11,844 కోట్లకు పెరిగింది.
అయితే, జీఎస్‌టీ పరమైన ప్రభావాల కారణంగా ఈ రెండింటినీ పోల్చి చూడరాదని సంస్థ వివరించింది. క్యూ3లో ట్రాక్టర్ అమ్మకాలు 6% వృద్ధితో 76,943 యూనిట్లుగా నమోదయ్యాయి. జీఎస్‌టీకి ఆర్థిక వ్యవస్థ సర్దుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగ్గానే ఉండగలవని ఎంఅండ్‌ఎం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment